News December 20, 2025
ఈనెల 22న జరిగే గ్రీవెన్స్ రద్దు: జనగామ కలెక్టర్

ఈనెల 22న జరిగే ప్రజావాణి రద్దు చేస్తున్నట్లు జనగామ కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. ఈనెల 22న పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల ప్రమాణ స్వీకరణ కార్యక్రమం ఉన్నందున, ఈ కార్యక్రమంలో ఎమ్మార్వోలు, ఎంపీడీవోలు పర్యవేక్షణ చేయాల్సి ఉంటుందన్నారు. అందువల్ల సోమవారం నిర్వహించే గ్రీవెన్స్ సెల్ రద్దు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లా ప్రజలు సహకరించాలని కోరారు.
Similar News
News January 20, 2026
రాష్ట్రంలో 859 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

తెలంగాణ డిస్ట్రిక్ కోర్టుల్లో 859 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హతగల వారు JAN 24 నుంచి ఫిబ్రవరి 13 వరకు అప్లై చేసుకోవచ్చు. స్టెనోగ్రాఫర్, టైపిస్ట్, Jr. అసిస్టెంట్, ఎగ్జామినర్ తదితర పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి డిగ్రీ, టెన్త్, ఏడో తరగతి ఉత్తీర్ణులు అర్హులు. వయసు 18 నుంచి 46ఏళ్ల మధ్య ఉండాలి. రాత పరీక్ష, వైవా వోస్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://tshc.gov.in
News January 20, 2026
గ్రీన్‌లాండ్ టెన్షన్.. కుదేలైన స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు భారీ నష్టాలు చవిచూశాయి. ఒక్క రోజులోనే రూ.9 లక్షల కోట్లకు పైగా నష్టం వాటిల్లింది. నిఫ్టీ 353 పాయింట్లకుపైగా పడిపోయి 25,232 వద్ద ముగియగా, సెన్సెక్స్ 1065 పాయింట్లకు పైగా నష్టపోయి 3 నెలల కనిష్ఠమైన 82,180కి చేరింది. గ్రీన్‌లాండ్‌పై US అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు, టారిఫ్‌ల బెదిరింపులతో ఇన్వెస్టర్లు ఆందోళనకు గురయ్యారు. దీంతో అన్ని రంగాలు నష్టాల్లోనే ట్రేడయ్యాయి.
News January 20, 2026
KNR: ‘పే స్కేల్ బకాయిలను వెంటనే చెల్లించాలి’

ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ బస్టాండ్ ఆవరణలోని ఆర్ఎం కార్యాలయం ఎదుట ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులు నిరసన తెలిపారు. 2017 పే స్కేల్ బకాయిలను వెంటనే చెల్లించాలని, ఎస్ఆర్‌బీఎస్ లైఫ్ సర్టిఫికెట్‌ను వెంటనే ఆన్ లైన్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.


