News December 20, 2025

సోమవారం ప్రజావాణి రద్దు: కలెక్టర్ మను చౌదరి

image

కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించాల్సిన ‘ప్రజావాణి’ కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ మను చౌదరి తెలిపారు. రాష్ట్రపతి శీతకాల విడిది ముగించుకుని ఢిల్లీ తిరుగు ప్రయాణం అవుతుండటం, అలాగే విపత్తు నివారణ చర్యలపై జిల్లా యంత్రాంగం మాక్ డ్రిల్ ఏర్పాట్లలో నిమగ్నమై ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. ఈ మార్పును గమనించి ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.

Similar News

News January 10, 2026

శంఖం పూలకు పెరుగుతున్న డిమాండ్

image

ఇప్పటివరకు పెరట్లో పూసే మొక్కగా మాత్రమే చూసిన శంఖం పూలు ఇప్పుడు రైతులకు ఆదాయ మార్గంగా మారుతున్నాయి. సహజ రంగులు, హెర్బల్ టీకి ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరగడంతో ఈ పూల సాగు భారీగా పెరుగుతోంది. అస్సాం, UP, WB రాష్ట్రాల్లో మహిళా రైతులు ఈ పంటతో మంచి లాభాలు పొందుతున్నారు. టీ, డై తయారీలో విస్తృతంగా ఉపయోగిస్తున్న వీటికి అమెరికా, యూరప్‌ మార్కెట్ల నుంచి ఆర్డర్లు వస్తున్నాయి.

News January 10, 2026

HYDలో ఫ్యూచర్ సిటీ.. ‘పంచాయతీ’ పవర్ కట్!

image

ఫ్యూచర్ సిటీ పేరుతో ప్రభుత్వం భారీ స్కెచ్ వేసి, RR(D)లోని 56 గ్రామాలను FCDA పరిధిలోకి తీసుకువచ్చింది. ఇక్కడి భూముల క్రయవిక్రయాలు, లేఅవుట్లకు ఇకపై పంచాయతీల సంతకాలు చెల్లకపోగా, గ్రామసభల ప్రమేయం లేకుండానే సాగు భూములను కమర్షియల్ జోన్లుగా మార్చే అధికారం బోర్డుకే కట్టబెట్టింది. భూములపై పూర్తి పట్టుకోసమే ఈ ‘సూపర్ బాడీ’ని తెచ్చారని, అభివృద్ధి ముసుగులో పల్లెగొంతు నొక్కేస్తున్నారని స్థానికులు అంటున్నారు.