News December 20, 2025

బావుసాయిపేట యువకుడికి నావికాదళంలో సబ్ లెఫ్టినెంట్ హోదా

image

కోనరావుపేట మండలం బావుసాయిపేట గ్రామానికి చెందిన బైరగోని నిహాంత్ గౌడ్ నావికాదళంలో సబ్ లెఫ్టినెంట్‌గా ఎంపికయ్యారు. కోరుకొండ సైనిక్ స్కూల్‌లో చదువుకున్న ఆయన 2021లో యూనియన్ UPSC నిర్వహించిన నేషనల్ డిఫెన్స్ అకాడమీ పరీక్షలో జాతీయ స్థాయిలో 289వ ర్యాంకు సాధించారు. నాలుగేళ్ల పాటు కఠినమైన శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్న నిహాంత్, ఇటీవల సబ్ లెఫ్టినెంట్ (గ్రూప్ ఏ అధికారి)గా బాధ్యతలు చేపట్టారు.

Similar News

News December 28, 2025

రేపు ప్రకాశం ఎస్పీ మీ కోసం కార్యక్రమం రద్దు

image

పోలీసుల వార్షిక నేర సమీక్షా సమావేశం జరగనున్న దృష్ట్యా, ప్రకాశం జిల్లా పోలీస్ కార్యాలయంలో రేపు నిర్వహించవలసిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేసినట్లు ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి, ఒంగోలులోని ఎస్పీ కార్యాలయానికి సోమవారం మీకోసం ఫిర్యాదుల నిమిత్తం రావద్దని ఎస్పీ కోరారు.

News December 28, 2025

HYD‌: ఐటీ హబ్‌లో Monday Blues!

image

IT కారిడార్లలో ఇప్పుడు ‘మండే బ్లూస్’ సరికొత్త రూపం దాల్చాయి. సండే నైట్ నుంచే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లను ‘సోమవారం భయం’ వెంటాడుతోంది. ‘బేర్ మినిమమ్ మండే’ పేరుతో కేవలం లాగిన్ అయ్యామనిపించడం, మీటింగ్‌లో కెమెరాలు ఆపేయడం, అత్యవసరమైతే తప్ప పని ముట్టుకోకపోవడం ఫ్యాషన్‌గా మారింది. కార్పొరేట్ కొలువుల్లో ఈ సోమరితనం మానసిక ప్రశాంతతా? లేక బాధ్యతారాహిత్యమా? అన్న చర్చ మొదలైంది. ​ఈ ‘మండే సిండ్రోమ్’ మీ ఆఫీసులోనూ ఉందా?

News December 28, 2025

రేపు కలెక్టరేట్‌లో ‘రెవెన్యూ క్లినిక్’ ప్రారంభం: కలెక్టర్

image

ప్రజల ఫిర్యాదుల పరిష్కార వేదికలో భాగంగా భూసంబంధిత సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు కలెక్టరేట్‌లో సోమవారం ‘రెవెన్యూ క్లినిక్’ ప్రారంభం కానుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదేశాల మేరకు ఈ ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. భూ సమస్యలతో ఇబ్బంది పడే అర్జీదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు.