News December 20, 2025

పెద్దపల్లి: యాదవ చారిటబుల్ ట్రస్ట్ వాలంటీర్లకు కలెక్టర్ సన్మానం

image

పెద్దపల్లి జిల్లా ప్రధాన ఆసుపత్రిలో మూడు నెలలు వాలంటీర్లుగా సేవలందించిన యాదవ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులను శనివారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సన్మానించారు. కే. స్వాతి, డి. సుజాత, జి. సరోజన, కె. రాజేంద్ర ప్రసాద్‌లకు శాలువాలు కప్పి ఆరోగ్యశాఖ తరఫున అనుభవ ధృవీకరణ పత్రాలు అందజేశారు. సేవా కార్యక్రమాలు అభినందనీయమని, భవిష్యత్‌లో మరిన్ని ప్రజోపయోగ కార్యక్రమాలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు.

Similar News

News January 15, 2026

సీఎం చంద్రబాబు కనుమ శుభాకాంక్షలు

image

AP: రాష్ట్ర ప్రజలకు సీఎం చంద్రబాబు కనుమ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ‘పశు సంపద మనకు అసలైన సంపద. రైతుల జీవితాలతో విడదీయరాని అనుబంధం పెనవేసుకున్న పశువులను పూజించే పవిత్ర కర్తవ్యాన్ని కనుమ పండుగ మనకు బోధిస్తుంది. ఆ విలువలను కాపాడుకుంటూ రైతులు ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. పశుపక్ష్యాదులను చక్కగా చూసుకుంటే ప్రకృతి కూడా కరుణిస్తుంది’ అని పేర్కొన్నారు.

News January 15, 2026

ప్రహరీగోడ ఎత్తులో హెచ్చుతగ్గులు ఉండవచ్చా?

image

ఇంటి ప్రహరీగోడ ఎత్తు అన్ని వైపులా సమానంగా ఉండకూడదని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. పడమర గోడ కంటే తూర్పు గోడ ఎత్తు తక్కువగా, ఉత్తరం కంటే దక్షిణం వైపు గోడ ఎత్తుగా ఉండాలని చెబుతున్నారు. ‘ఈ హెచ్చుతగ్గులు కొంచెం ఉన్నా సరిపోతుంది. ఈ నిర్మాణం ఇంటి రక్షణకు, ఐశ్వర్యానికి తోడ్పడుతుంది. దిక్కులు బట్టి గోడల ఎత్తులు అమర్చుకుంటే ఇంట్లో శాంతి, సౌఖ్యం, స్థిరత్వం లభిస్తాయి’ అంటున్నారు. Vasthu

News January 15, 2026

ఇంకా తేలని జగిత్యాల ఎమ్మెల్యే భవితవ్యం..?

image

గత కొన్ని నెలలుగా ఎమ్మెల్యేల పార్టీ మార్పు అంశం హాట్ టాపిక్‌గా నడుస్తోంది. అయితే, ఇటీవలే 10 మందిలో ఐదుగురు ఎమ్మెల్యేలు పార్టీ మారలేదని స్పీకర్ తీర్పునివ్వగ.. తాజాగా శ్రీనివాస్ రెడ్డి, యాదయ్యలు పార్టీ మారినట్టు ఆధారాలు లేవని ఫిర్యాదులను తోసిపిచ్చారు. అయితే, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పార్టీ ఫిరాయింపు విచారణ ఇంకా కొనసాగుతూ ఉండగా.. ఇంకా ఆయన భవితవ్యం తేలాల్సి ఉంది. దీంతో సంజయ్ వర్గంలో ఉత్కంఠ నెలకొంది.