News December 20, 2025

జీహెచ్‌ఎంసీ వర్సెస్ సీజీజీ.. డేటా బదిలీపై ప్రతిష్టంభన

image

జీహెచ్‌ఎంసీలో విలీనమైన 27 మున్సిపాలిటీల ఆస్తి పన్ను డేటా బదిలీ వ్యవహారం వివాదాస్పదంగా మారింది. CGG నుంచి వివరాలు అందకపోవడంతో పన్ను వసూళ్లకు బ్రేక్ పడింది. బల్దియా వెబ్‌సైట్‌లో కొత్త పోర్టల్ సిద్ధం చేసినా, అసలు డేటా లేకపోవడంతో అధికారులు ఇబ్బంది పడుతున్నారు. ఈ విభాగాల మధ్య సమన్వయ లోపంతో సామాన్య ప్రజలు అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ ‘డేటా చిక్కుముడి’ని విడదీయాలని కోరుతున్నారు.

Similar News

News January 12, 2026

ఎస్పీ కార్యాలయంలో పీజీఆర్‌ఎస్‌కు 16 ఫిర్యాదులు

image

తూ.గో జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌కు 16 ఆర్జీలు వచ్చాయి. జిల్లా ఎస్పీ డి.నరసింహ కిశోర్‌ ప్రజల నుంచి స్వయంగా ఆర్జీలు స్వీకరించి, సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి, ఫిర్యాదులను చట్టపరిధిలో పరిష్కరించి బాధితులకు సత్వర న్యాయం చేయాలని ఆదేశించారు. ప్రజల సమస్యల పరిష్కారమే ప్రథమ ప్రాధాన్యమని ఈ సందర్భంగా ఎస్పీ స్పష్టం చేశారు.

News January 12, 2026

చంద్రబాబు అప్పులు చేస్తే రాష్ట్రం సింగపూర్ అవుతుందా: రాంబాబు

image

AP: జగన్‌ హయాంలో ఐదేళ్లలో రాష్ట్రంలో ₹3.32L కోట్ల అప్పులు చేస్తే చంద్రబాబు ఏడాదిన్నరలోనే ₹3.02L కోట్లు అప్పు చేశారని అంబటి రాంబాబు విమర్శించారు. ‘వైసీపీ అప్పులు చేస్తే రాష్ట్రం శ్రీలంక అవుతుంది అన్నారు. చంద్రబాబు అప్పులు చేస్తే సింగపూర్‌ అవుతుందా? జగన్‌ చేసిన అప్పుల్లో 90% CBN ఏడాదిన్నరలోనే చేశారు. ఎన్నికల హామీలు ఇప్పటివరకు పూర్తి స్థాయిలో అమలు చేయలేదు’ అని అంబటి ఫైరయ్యారు.

News January 12, 2026

మేడారం: మహిళలకు ప్రత్యేకంగా మొబైల్ మరుగుదొడ్లు

image

మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతరను పురస్కరించుకుని అధికారులు మహిళా భక్తుల కోసం మొబైల్ టాయిలెట్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. జాతరలో మహిళలు మలమూత్ర విసర్జన కోసం ఇబ్బందులు పడవద్దని, ముందస్తు జాగ్రత్త చర్యలో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన రెండు మొబైల్ టాయిలెట్ బస్సులను మేడారంలో ఏర్పాటు చేశారు. మహిళా భక్తులకు ఇబ్బందులు తప్పనున్నాయి.