News December 20, 2025

KNR: ఎన్నికల విధులకు గైర్హాజరు.. 713 మందికి నోటీసులు

image

గ్రామ పంచాయతీ ఎన్నికల విధులకు గైర్హాజరైన 713 మంది ఉద్యోగులకు కరీంనగర్ జిల్లా నోడల్ అధికారి అశ్విని తానాజీ వాకడే షోకాజ్ నోటీసులు జారీ చేశారు. మూడు విడతల్లో జరిగిన పోలింగ్‌కు పీఓ, ఏపీఓలుగా నియామకమైనా, ముందస్తు అనుమతి లేకుండా వీరు విధులకు రాలేదని పేర్కొన్నారు. ఎన్నికల నిబంధనల ఉల్లంఘనపై క్రమశిక్షణా చర్యలు ఎందుకు తీసుకోకూడదో లిఖితపూర్వకంగా వివరణ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.

Similar News

News January 14, 2026

కరీంనగర్ జిల్లాలో 2,292 టన్నుల యూరియా నిల్వలు

image

కరీంనగర్ జిల్లాలో సాగు అవసరాలకు సరిపడా యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని, రైతులు ఆందోళన చెందవద్దని కలెక్టర్ పమేలా సత్పతి ఒక ప్రకటనలో తెలిపారు. గత 15 రోజుల్లో వివిధ సొసైటీల ద్వారా 8,124 మెట్రిక్ టన్నుల ఎరువులను పంపిణీ చేశామని పేర్కొన్నారు. ప్రస్తుతం జిల్లాలో మరో 2,292 మెట్రిక్ టన్నుల నిల్వలు సిద్ధంగా ఉన్నాయని, అవసరానికి అనుగుణంగా అదనపు స్టాక్‌ను తెప్పిస్తామని ఆమె హామీ ఇచ్చారు.

News January 12, 2026

కరీంనగర్ జిల్లాలో 765 యాక్సిడెంట్స్, 180 మరణాలు

image

జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల్లో భాగంగా సోమవారం చొప్పదండిలో కరీంనగర్ డీటీఓ శ్రీకాంత్ చక్రవర్తి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆయన జిల్లాలో 2025లో 765 రోడ్డు ప్రమాదాలు జరిగి 180 మృతి చెందినట్లు తెలిపారు. చొప్పదండిలోనే 31 యాక్సిడెంట్స్ జరిగాయన్నారు. ఓవర్ లోడ్, మద్యం సేవించి డ్రైవ్ చేయడం, మొబైల్ డ్రైవింగ్ వంటివి ప్రమాదాలకు కారణాలని తెలిపారు. రోడ్ సేఫ్టీ కోఆర్డినేటర్ నీలం సంపత్ పాల్గొన్నారు.

News January 11, 2026

హుజూరాబాద్‌: లాడ్జీలో యువకుడి ఆత్మహత్య

image

హుజూరాబాద్‌‌లోని వైస్రాయ్ లాడ్జీలో వడ్లకొండ చిరంజీవి(30) ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం మందలోరిపల్లికి చెందిన చిరంజీవి, 2 రోజుల క్రితం లాడ్జీలో గదిని అద్దెకు తీసుకున్నాడు. ఆదివారం ఉదయం నుంచి అతను ఫోన్ ఎత్తకపోవడంతో అనుమానం వచ్చిన స్నేహితులు సాయంత్రం లాడ్జీకి చేరుకొని, గది కిటికీలో నుంచి చూడగా చిరంజీవి ఫ్యాన్‌కు ఉరివేసుకుని కనిపించాడు.