News December 20, 2025
₹3Cr కోసం తండ్రిని పాముకాటుతో చంపించి..

పున్నామ నరకం నుంచి తప్పించేవాడు కొడుకనేది ఒకప్పటి మాట. మానవత్వం మరిచి ఆస్తుల కోసం తండ్రిని చంపేసే కొడుకులున్న కలికాలం ఇది. ఇలాంటి ఘటన తమిళనాడులోని తిరువళ్లూరులో జరిగింది. తండ్రి గణేశన్(56) పేరుపై ₹3Cr బీమా చేయించి పాము కాటుతో చంపారు దుర్మార్గపు కొడుకులు. OCTలో ఈ ఘటన జరగగా బీమా సంస్థ అనుమానంతో అసలు విషయం బయటికొచ్చింది. ప్రస్తుతం వీరు నోట్లకు బదులు జైలు ఊచలు లెక్కబెడుతున్నారు.
Similar News
News December 25, 2025
మామిడిలో తేనె మంచు పురుగుల నివారణ

మామిడిలో పూతకు ముందు తేనె మంచు పురుగులు, కలుపు, చెత్తచెదారాల్లో దాగి ఉంటాయి. డిసెంబరు రెండో పక్షం నుంచి ఈ పురుగులు చెట్ల కాండం, కొమ్మలపైకి ఎగబాకుతుంటాయి. అందుకే డిసెంబరు 3వ వారంలో లీటరు నీటికి అసిపేటు 1.5గ్రా. లేదా క్లోరోఫైరిఫాస్ 50ఇ.సి. 1మి.లీ. మందుతో అజాడిరిక్టిన్ 10,000 పిపియం (లీటరు నీటికి 2మి.లీ.) కలిపి కాండము, కొమ్మలు బాగా తడిసేటట్లు స్ప్రే చేసి, తొలిదశలో ఈ పురుగులను నివారించవచ్చు.
News December 25, 2025
విశాఖలో అమెజాన్ విస్తరణ.. 850 మందికి జాబ్స్!

AP: విశాఖలో తమ కార్యకలాపాలను అమెజాన్ విస్తరిస్తోంది. పెందుర్తి వద్ద రెండేళ్ల క్రితం డెవలప్‌మెంట్ సెంటర్‌ను ఆ సంస్థ ప్రారంభించింది. అక్కడ 400 మంది పని చేస్తున్నారు. లైసెన్స్ ముగియడంతో సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా(STPI) వద్ద రీ రిజిస్టర్ చేసుకుంది. ఇప్పుడు దాన్ని విస్తరించి 850 మందిని నియమించుకోనుందని IT వర్గాలు తెలిపాయి. మూడేళ్లలో ₹9,740 కోట్ల ఎగుమతులు లక్ష్యంగా పెట్టుకుందని చెప్పాయి.
News December 25, 2025
తిరుమలలో రామానుజాచార్యుల పరీక్ష

తిరుమల క్షేత్రం వైష్ణవమా? శైవమా? అనే సందిగ్ధత నెలకొన్నప్పుడు రామానుజులు ఓ పరీక్ష నిర్వహించారు. గర్భాలయంలో స్వామివారి ముందు శంఖుచక్రాలను, త్రిశూల డమరుకాలను ఉంచి తలుపులు మూశారు. మరుసటి రోజు ఉదయం తలుపులు తీసి చూడగా, శ్రీవారు శంఖుచక్రాలు ధరించి విష్ణురూపంలో దర్శనమిచ్చారు. ఈ ఘట్టంతో తిరుమల వైష్ణవ క్షేత్రమని నిరూపితమైంది. రామానుజుల కృషితో తిరుమలలో వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం పూజలు నిర్వహిస్తున్నారు.


