News December 20, 2025
మానేరు నదిపై రూ.203 కోట్లతో హై లెవెల్ వంతెన

కాటారం-మంథని మండలాల సరిహద్దులో ప్రవహిస్తున్న మానేరు నదిపై హై లెవెల్ వంతెన, రెండు వైపులా అప్రోచ్ రోడ్డు నిర్మాణానికి రూ.203 కోట్లు మంజూరైనట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఆరెంద మీదుగా దామెరకుంట వరకు 1 కి.మీ. 120 మీటర్ల పొడవు, 13 మీటర్ల వెడల్పుతో హై లెవెల్ బ్రిడ్జి, వెంకటాపూర్ నుంచి దామెరకుంట రోడ్డు వరకు రెండు వైపులా 9.530Mtrs అప్రోచ్ రోడ్డు నిర్మించనున్నట్లు పేర్కొన్నారు.
Similar News
News December 27, 2025
పల్నాడు జిల్లాలో ఉపాధి హామీ పనులలో అక్రమాలు.!

ఉపాధి హామీ పథకం కూలీల కాకుండా అక్రమార్కులకు వరంగా మారింది. డ్వామా ఆధ్వర్యంలో పనులు నిర్వహిస్తుండగా, కోట్లల్లో అక్రమాలను గుర్తించిన రికవరీ చేయడం లేదు. సోషల్ ఆడిట్ పేరుతో అధికారులు కాలక్షేపం చేయడానికి పరిమితం అవుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. జిల్లాలో సోషల్ యూనిట్ 790 పనులులో అక్రమాలు గుర్తించారు. రూ.2,11,94,590 కోట్ల నిధులు దుర్వినియోగం అయ్యాయని నిర్ధారించారు. రూపాయి కూడా రికవరీ చేయలేదు.
News December 27, 2025
రేపు ట్రంప్‌తో జెలెన్ స్కీ భేటీ!

US అధ్యక్షుడు ట్రంప్‌తో రేపు ఫ్లోరిడాలో భేటీ కానున్నట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ పేర్కొన్నారు. రష్యాతో యుద్ధం ముగింపు, శాంతి ఒప్పందంపై చర్చించనున్నట్లు తెలిపారు. ట్రంప్ ప్రతిపాదించిన 20సూత్రాల ప్రణాళికలో 90% మేర ఏకాభిప్రాయం కుదిరిందని జెలెన్ స్కీ చెప్పారు. రేపటి భేటీలో ఉక్రెయిన్‌కు US ఇచ్చే భద్రతా హామీలపై చర్చించనున్నామన్నారు. కొత్త ఏడాదికి ముందే కీలక పరిణామాలు సంభవించొచ్చని తెలిపారు.
News December 27, 2025
ఉమ్మడి KNRలో ‘ఎక్సైజ్’ అధికారుల ‘EXTRA దందా’..!

ఎక్సైజ్ అధికారులు మద్యం షాపుల ఓనర్ల నుంచి వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఉమ్మడి KNRలో 287 WINES ఉండగా రూ.7 కోట్ల టార్గెట్‌తో ఒక్కో షాప్ నుంచి రూ.2.5 లక్షల చొప్పున ఇవ్వాలని హుకుం జారీ చేస్తున్నట్లు తెలిసింది. ఇవే కాకుండా నెలకు రూ.15000లు ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారట. దీంతో కొందరు మద్యం వ్యాపారులు మామూళ్లు చెల్లిస్తుండగా మరి కొంతమంది ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారట.


