News December 20, 2025
లబ్ధిదారులకు మంచి సేవలందించాలి: కలెక్టర్

అంగన్వాడీ కేంద్రాల ద్వారా లబ్ధిదారులకు మంచి సేవలు అందించాలని కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ అన్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖ జిల్లా స్థాయి కమిటీ సమావేశాన్ని శనివారం బాపట్ల కలెక్టరేట్‌లో నిర్వహించారు. అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాల పనితీరు బాగుండాలని కలెక్టర్ చెప్పారు. లబ్ధిదారులకు మెరుగైన సేవలు అందేలా కృషి చేయాలన్నారు. అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాల పనితీరు ఆధారంగా వారికి ప్రాధాన్యత ఉంటుందన్నారు.
Similar News
News January 12, 2026
BREAKING: హనుమకొండ: యువకుడి మృతదేహం కలకలం!

హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ధర్మారం గ్రామ శివారులో యువకుడి మృతదేహం లభ్యమైంది. స్థానికులు తెలిపిన వివరాలు.. ధర్మారం గ్రామానికి చెందిన పిట్టల అశోక్‌గా అతడిని గుర్తించారు. ఈనెల 6వ తేదీన ఇంటి నుంచి వెళ్లిపోయిన అశోక్ విగతజీవిగా కనిపించడంతో కుటుంబీకులు రోదిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలిస్తున్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News January 12, 2026
తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే 10% జీతం కట్: సీఎం

TG: తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం రేవంత్ వార్నింగ్ ఇచ్చారు. ఎవరైనా అలా చేస్తే ప్రతి నెలా జీతంలో 10 శాతం తల్లిదండ్రులకు అందించేలా చట్టం తెస్తామని స్పష్టం చేశారు. తల్లిదండ్రుల ఫిర్యాదులను పరిశీలించి పిల్లల జీతంలో నేరుగా 10 శాతం తల్లిదండ్రుల ఖాతాలోకి వెళ్లేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజాభవన్‌లో ‘ప్రణామ్’ వయోవృద్ధుల డే కేర్ సెంటర్లను సీఎం ప్రారంభించారు.
News January 12, 2026
అర్జీలను పూర్తిస్థాయిలో విచారించి పరిష్కారం చూపాలి: JC

ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలను పూర్తిస్థాయిలో విచారించి బాధితులకు పరిష్కారం చూపాలని బాపట్ల జాయింట్ కలెక్టర్ భావన చెప్పారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన పీజీఆర్ఎస్‌లో ఆమె ప్రజల నుంచి నేరుగా అర్జీలను స్వీకరించారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని నిర్ణీత సమయంలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు.


