News December 20, 2025
సిరిసిల్ల: ‘మీ డబ్బు.. మీ హక్కు కార్యక్రమం సద్వినియోగం చేసుకోవాలి’

క్లెయిమ్ చేసుకోని ఆర్థికపరమైన ఆస్తుల కోసం ఈ నెల 22 వ తేదీన ‘మీ డబ్బు.. మీ హక్కు’ పేరిట ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నట్లు ప్రోగ్రామ్ కన్వీనర్, లీడ్ బ్యాంక్ మేనేజర్ మల్లికార్జున రావు ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో మధ్యాహ్నం ఒంటిగంటకు ఈ కార్యక్రమం నిర్వహిస్తామని, క్లెయిమ్ చేసుకోని ఆర్థికపరమైన ఆస్తుల వాస్తవ యజమానులు వాటిని పొందేందుకు దీనిని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
Similar News
News December 28, 2025
త్వరలో కరెంట్ బిల్లులు తగ్గే ఛాన్స్!

విద్యుత్ ట్రేడింగ్ ఎక్స్‌ఛేంజ్‌లు వసూలు చేసే ఛార్జీలపై సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ సమీక్షిస్తోంది. 2026లో అమలులోకి వస్తున్న మార్కెట్ కప్లింగ్ విధానంతో అన్ని ఎక్స్‌ఛేంజీలు ఒకే రేట్ వసూలు చేయాలి. ప్రస్తుతం యూనిట్‌కు 2పైసలుగా ఉన్న ట్రాన్సాక్షన్ ఫీజును 1.5/1.25పైసలకు తగ్గించాలని కేంద్రం భావిస్తోంది. దీంతో డిస్కంలు తక్కువ ధరకు కరెంట్ కొనుగోలు చేస్తే సామాన్యులకు కరెంట్ బిల్ తగ్గుతుంది.
News December 28, 2025
గాదె ఇన్నయ్య ‘మా ఇల్లు’కు మంత్రి సీతక్క

TG: జనగామ జిల్లా జాఫర్‌గఢ్‌లోని <<18631208>>గాదె ఇన్నయ్య <<>>నిర్వహిస్తున్న ‘మా ఇల్లు’ అనాథాశ్రమాన్ని మంత్రి సీతక్క ఇవాళ సందర్శించారు. ఇన్నయ్యను మిస్ అవుతున్నామని కన్నీళ్లు పెట్టుకుంటున్న పిల్లలను ఓదార్చి ధైర్యంగా ఉండాలని సూచించారు. చదువుకు, బసకు అవసరమైన వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం సాగరం గ్రామంలోని ఇన్నయ్య ఇంటికి వెళ్లి అనారోగ్యంతో మంచానికే పరిమితమైన ఆయన తల్లిదండ్రులను పరామర్శించారు.
News December 28, 2025
విశాఖ: ‘స్త్రీ శక్తి’ పథకం ఎఫెక్ట్.. 75%కి పెరిగిన మహిళా ప్రయాణికుల సంఖ్య

విశాఖపట్నం ఆర్టీసీ రీజనల్ మేనేజర్ అప్పలనాయుడు గాజువాక, స్టీల్ సిటీ డిపోలను శనివారం తనిఖీ చేశారు. ‘స్త్రీ శక్తి’ పథకంతో జిల్లాలో మహిళా ప్రయాణికుల సంఖ్య 75%కి పెరిగిందని, దీనివల్ల టికెట్ మిషన్ల ఛార్జింగ్ త్వరగా అయిపోతోందన్నారు. ఈ సమస్య పరిష్కారానికి కండక్టర్లకు 20,000 mAh పవర్ బ్యాంక్స్ పంపిణీ చేశారు. డిప్యూటీ సీఎంఈ గంగాధర్ ఇతర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


