News December 20, 2025

ఒకరికొకరు తోడుగా విధినే గెలిచిన జంట ❤️

image

‘ధర్మార్ధ కామములలోన ఏనాడు నీతోడు ఎన్నడూ నే విడిచిపోను.. ఈ బాస చేసి ఇక నిండు నూరేళ్లు నీ నీడనై నిలిచి కాపాడుతాను’ అనే పాటకు నిదర్శనం ‘Family Man’ నటుడు షరీబ్(JK). ఈయన 2003లో నస్రీన్‌ను పెళ్లాడారు. ఆరంభంలో ఆమె తన కష్టార్జితంతో భర్తను ప్రోత్సహించారు. తర్వాత నస్రీన్‌ నోటి క్యాన్సర్ బారిన పడగా భర్త అండగా నిలిచారు. 4సర్జరీల తర్వాత ఆమె కోలుకున్నారు. ఒకరికొకరు తోడుగా నిలిచి గెలిచిన ఆ జంట ఎందరికో ఆదర్శం.

Similar News

News January 16, 2026

రోహిత్‌ కెప్టెన్సీకి గంభీర్ చెక్.. మనోజ్ తివారీ సంచలన ఆరోపణలు!

image

ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచినా రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తీసేయడం వెనుక కోచ్ గంభీర్ హస్తం ఉండొచ్చని మనోజ్ తివారీ అనుమానం వ్యక్తం చేశారు. అగార్కర్ కోచ్ ప్రభావానికి లోనై ఉండొచ్చేమోనని, రోహిత్ లాంటి లెజెండ్‌ను పక్కన పెట్టడం క్రీడా ధర్మానికి విరుద్ధమన్నారు. 2027 వరల్డ్ కప్ ఆడగల సత్తా ఉన్న హిట్‌మ్యాన్‌ను కాదని గిల్‌కు బాధ్యతలు ఇవ్వడంలో లాజిక్ లేదన్నారు. ఇది రోహిత్‌ను అవమానించడమేనని ఫైర్ అయ్యారు.

News January 16, 2026

APFIRST పేరుతో తిరుపతిలో రీసెర్చ్ సెంటర్

image

AP ఫ్యూచరిస్టిక్ ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ(APFIRST) పేరిట తిరుపతిలో రీసెర్చ్ కేంద్రం ఏర్పాటు కానుంది. ఏరో స్పేస్-డిఫెన్స్, ఐటీ-డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ సమావేశంలో CM CBN దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ‘ఏరో స్పేస్, డిఫెన్స్, స్పేస్, క్వాంటం, బయో టెక్నాలజీ, గ్రీన్ ఎనర్జీ కీలకం కానున్నాయి. ఈదిశగా పాలసీలు పెడుతున్నాం. IIT-IISER ఆధ్వర్యంలో ఇది ఏర్పాటు కానుంది’ అని తెలిపారు.

News January 16, 2026

ప్రాధాన్యం సంతరించుకున్న మోదీ WB టూర్

image

PMమోదీ రేపు, ఎల్లుండి WBలో చేపట్టనున్న పర్యటన రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. APRలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ₹3,250CR ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేయనున్నారు. ఇతర రాష్ట్రాలకు 7 అమృత్ భారత్ రైళ్లను, తొలి వందే భారత్ స్లీపర్‌ ట్రైన్‌ను ప్రారంభిస్తారు. సింగూర్‌లో ₹830CR అభివృద్ధి పనులకు శ్రీకారం, బాలాగఢ్‌లో 900 ఎకరాల్లో కార్గో హ్యాండ్లింగ్ టెర్మినల్‌కు శంకుస్థాపన చేస్తారు.