News April 21, 2024
పుట్టపర్తి టీడీపీ రెబల్ అభ్యర్థిగా పోటీ చేస్తా: పోలన్న

పుట్టపర్తి నియోజకవర్గం నుంచి టీడీపీ రెబల్ అభ్యర్థిగా పోటీ చేస్తానని వడ్డెర సంఘం నాయకులు దళవాయి సిమెంట్ పోలన్న పేర్కొన్నారు. ఆదివారం ఆయన పుట్టపర్తిలో మాట్లాడుతూ.. ఎన్నికలలో వడ్డెరలకు సముచిత స్థానం కల్పిస్తానని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు మాయమాటలు చెప్పి చివరిలో మోసం చేశారని అన్నారు. అందుకే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి వడ్డెర్ల సత్తా చూపిస్తామన్నారు.
Similar News
News March 12, 2026
అనంతపురం జిల్లాలో 2,75,642 మంది రైతులు అర్హులు

అనంతపురం జిల్లా వ్యాప్తంగా అన్నదాత సుఖీభవ పథకం కింద 2,75,642 మంది రైతుల అర్హుల జాబితాను అధికారులు ప్రకటించారు. జిల్లాకు రూ.163.26 కోట్లు కేటాయించగా అందులో అన్నదాత సుఖీభవ పథకానికి రూ.110.26 కోట్లు, పీఎం కిసాన్‌కు రూ.53.01 కోట్లు విడుదల చేయనున్నారు. జిల్లాలో అత్యధికంగా శింగనమల నియోజకవర్గంలో 54,338 రైతులకు అందించనున్నారు.
News March 12, 2026
రూ.20 కోట్లతో సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు

అనంతపురం నగరపాలక సంస్థ విద్యుత్ బిల్లుల భారం తగ్గించుకునేందుకు సొంతంగా సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ జస్వంత్ తెలిపారు. ఏటా రూ.10 కోట్ల వ్యయాన్ని ఆదా చేసేలా అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. రూ.20 కోట్లతో ఈ ప్రాజెక్టు చేపట్టనున్నారు. ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ విన్నపం మేరకు సీఎం చంద్రబాబు ఈ ప్లాంట్ కు సహకారం అందించారు.
News March 11, 2026
అనంతపురం జిల్లాలో గ్యాస్ కొరత లేదు: జేసీ

అనంతపురం జిల్లాలో గ్యాస్ ఏజెన్సీల ద్వారా గ్యాస్ వినియోగదారులకు డొమెస్టిక్ సిలిండర్లు సాధారణంగానే సరఫరా కొనసాగుతోందని, ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ పేర్కొన్నారు. గ్యాస్ కొరత వస్తుందనే ఉద్దేశంతో వెంట వెంటనే వినియోగదారులు ఆన్‌లైన్‌లో గ్యాస్ బుకింగ్ చేయడానికి వెబ్ పోర్టల్ అనుమతించదన్నారు. సింగిల్ సిలిండర్ 21 రోజులు, డబుల్ సిలిండర్ 30 రోజుల వ్యవధి అన్నారు.


