News December 20, 2025
జిల్లాను పారిశ్రామిక హబ్‌గా తీర్చిదిద్దాలి: కలెక్టర్

ఒక కుటుంబం-ఒక పారిశ్రామికవేత్త స్ఫూర్తితో యువత అందుబాటులోని పారిశ్రామిక పథకాలను సద్వినియోగం చేసుకునేలా అవగాహన పెంచాలని కలెక్టర్ లక్ష్మీశ ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటైన ఇగ్నైట్ సెల్‌ను ఆయన సందర్శించారు. జిల్లాను పారిశ్రామిక హబ్‌గా మార్చేందుకు అమలవుతున్న కార్యక్రమాల ప్రగతిని నిరంతరం సమీక్షిస్తున్నట్లు తెలిపారు.
Similar News
News January 10, 2026
జలపతి తండాలో మేకలపై చిరుత పులి దాడి

చందుర్తి మండలంలో చిరుత పులి సంచారం గిరిజన తండాలను వణికిస్తోంది. జలపతి తండా సమీపంలో చిరుత మేకలపై దాడి చేయగా, స్థానికుల అరుపులతో వెనుదిరిగింది. మేకల యజమాని రాజుకు భారీ నష్టం తప్పినప్పటికీ, చిరుత మళ్లీ వస్తుందేమోనన్న ఆందోళన తండావాసుల్లో నెలకొంది. అటవీ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి బోన్లు ఏర్పాటు చేయాలని, తండాల చుట్టూ రక్షణ చర్యలు చేపట్టాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు.
News January 10, 2026
ఇందిరమ్మ ఇళ్ల గ్రౌండింగ్ పూర్తి చేయాలి: కలెక్టర్

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇండ్ల హౌసింగ్ కార్యక్రమాన్ని వేగవంతం చేయడంతో పాటు స్వయం సహాయక సంఘాల కుటుంబాలకు స్థిరమైన ఉపాధి, నైపుణ్యాభివృద్ధి అవకాశాలు కల్పించడం లక్ష్యంగా పనిచేయాలని వరంగల్ కలెక్టర్ డా.సత్య శారద అన్నారు. శుక్రవారం కలెక్టర్ ఛాంబర్లో జిల్లా కో-ఆర్డినేషన్ కమిటీ సమావేశం నిర్వహించారు. జడ్పీ సీఈవో, ఇన్ ఛార్జ్ డీఆర్డీఓ రామ్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
News January 10, 2026
ఏలూరు జిల్లా బీజేపీ ఎస్సీ మోర్చా కమిటీ నియామకం

ఏలూరు జిల్లా భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా కమిటీ నియామకాన్ని జిల్లా అధ్యక్షులు చౌటుపల్లి విక్రమ్ కిషోర్ శుక్రవారం ప్రకటించారు. జిల్లా అధ్యక్షులుగా బుర్రి శ్రీకర్, ఉపాధ్యక్షులుగా మరుబరిక శ్రీనివాస్, తిరివీధి రాజేంద్రప్రసాద్, మొవ్వ ఫణీంద్ర కుమార్, గంజి బాలాజీ, జనరల్ సెక్రటరీలుగా రాయల నాగమల్లేశ్వరరావు, పగుర్ల చిట్టి బాబు నియమితులయ్యారు.


