News December 21, 2025
సిరిసిల్ల: ఎన్నికల విజయవంతంపై కలెక్టర్‌కు శుభాకాంక్షలు

గ్రామపంచాయతీ ఎన్నికలు విజయవంతంగా నిర్వహించిన సందర్భంగా జిల్లాలోని ఎంపీడీవోలు, జిల్లా పంచాయతీ కార్యాలయ సిబ్బంది జిల్లా ఇన్చార్జి కలెక్టర్ గరీమ అగ్రవాల్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో సిరిసిల్లలోని జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో ఇన్చార్జి కలెక్టర్ ను వారు మర్యాదపూర్వకంగా కలిశారు.
Similar News
News January 3, 2026
అడ్డరోడ్డు ‘రెవెన్యూ’ పంచాయితీ!

అడ్డరోడ్డు కేంద్రంగా రాజకీయ రగడ చెలరేగింది. ఇక్కడ RDO కార్యాలయం ప్రారంభించడం వెనుక కూటమి నేతల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. హోంమంత్రి అనిత కృషితో డివిజన్ వచ్చిందని TDP సంబరాలు చేసుకోగా.. జనసేన MLA విజయ్ కుమార్ అసంతృప్తిగా ఉన్నట్లు చర్చ సాగుతోంది. ప్రారంభ కార్యక్రమానికి కూడా MLA హాజరు కాకపోవడంతో రాజకీయ చర్చకు దారితీసింది.
News January 3, 2026
నేడు ఉల్లి రైతుల ఖాతాల్లోకి డబ్బులు

AP: ప్రకృతి వైపరీత్యాలు, ధరల పతనంతో నష్టపోయిన ఉల్లి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనుంది. ఖరీఫ్‌లో ఉల్లి సంక్షోభాన్ని ప్రభుత్వం గుర్తించిందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. కర్నూలు, కడప జిల్లాలకు చెందిన 37,752 మంది రైతుల అకౌంట్లలో రూ.128.33 కోట్లను ఈరోజు జమ చేయనున్నారు. కర్నూల్ జిల్లాల్లోనే 31,352 మంది ఖాతాల్లో రూ.99.92కోట్లు జమ కానున్నట్లు పేర్కొన్నారు.
News January 3, 2026
గోదావరిలో గుర్తు తెలియని మృతదేహం

కొవ్వూరు ఎరినమ్మ ఘాట్ వద్ద శనివారం గుర్తు తెలియని వృద్ధుడి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. పట్టణ సీఐ పీ. విశ్వం ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. మృతుడికి సుమారు 60 ఏళ్లు పైబడి ఉండవచ్చునని భావిస్తున్నారు. మృతుడి వద్ద ఏ విధమైన ఆధారాలు లభ్యం కాలేదన్నారు. మృతుని వివరాలు తెలిసిన వారు 9440796622కు కాల్ చేయాలన్నారు.


