News December 21, 2025

తిమ్మాపూర్: గ్రామీణ మహిళలకు ఉచిత టైలరింగ్ శిక్షణ

image

ఎల్ఎండి కాలనీలోని ఎస్‌బీఐ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో మహిళలకు ఉచిత ఉపాధి శిక్షణకు ధరఖాస్తులను కోరుతున్నట్లు సంస్థ డైరెక్టర్ సంపత్ తెలిపారు. టైలరింగ్ శిక్షణ ఈనెల 30న ప్రారంభిస్తామని, శిక్షణ కాలం 31 రోజులని, శిక్షణ సమయంలో ఉచిత వసతి భోజన సదుపాయాలంటాయని చెప్పారు. 18 -45 ఏళ్ల పదోతరగతి చదివిన ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన గ్రామీణ మహిళలు అర్హులని పేర్కొన్నారు.

Similar News

News January 10, 2026

WPL: RCB అద్భుత విజయం

image

WPL 2026 సీజన్‌ తొలి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అద్భుత విజయం సాధించింది. ముంబయి ఇండియన్స్‌ నిర్దేశించిన 155 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ చివరి ఓవర్‌లో ఛేదించింది. చివరి ఓవర్‌లో 18 పరుగులు అవసరమైన వేళ డి క్లెర్క్ కీలక ఇన్నింగ్స్ ఆడారు. తీవ్ర ఒత్తిడిలోనూ ఆమె అద్భుత షాట్లతో విరుచుకుపడి టాప్ స్కోరర్‌గా (63) నిలిచారు. మరోవైపు బౌలింగ్‌లోనూ ఆమె సత్తా (నాలుగు ఓవర్లలో 4 వికెట్లు) చాటారు.

News January 10, 2026

నెల్లూరు ఎస్పీని అభినందించిన హోం మంత్రి

image

నెల్లూరు ఎస్పీ అజితా వేజండ్లను హోం మంత్రి వంగలపూడి అనిత అభినందించారు. నెల్లూరు జిల్లా జైలును ఆమె తనిఖీ చేశారు. జిల్లాలో మంచి సంస్కృతి నెలకొందని చెప్పారు. రౌడీ షీటర్లు, పీడీ యాక్ట్, రప్పా రప్పా అంటూ కత్తులతో తిరిగే బ్యాచ్‌ను రోడ్లమీద నడిపించడాన్ని మంత్రి అభినందించారు. శాంతి భద్రతలకు ఎవరు భంగం కలిగించినా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

News January 10, 2026

హైదరాబాద్‌లో ‘టెర్రస్’ వార్!

image

సిటీలో సంక్రాంతి ముందే వచ్చేసింది. శుక్రవారం సాయంత్రం ఓల్డ్ సిటీ, అశోక్‌నగర్, తార్నాక, మల్కాజిగిరి గల్లీల్లో ఎటు చూసినా పతంగిల సందడే. అపార్ట్‌మెంట్ టెర్రస్ యాక్సెస్ ఒక ‘స్టేటస్ సింబల్’గా మారగా ఇండిపెండెంట్ హౌసెస్ మీద లోకల్ స్లాంగ్‌తో పందేలు కాస్తున్నారు. ఒక మేడ మీద పాత తెలుగు హిట్లు, పక్క బిల్డింగ్‌లో మాస్ బీట్ల మధ్య ‘కాటే’ కేకలు ఊదరగొడుతున్నాయి. ఈ ‘టెర్రస్ వార్’ ఇప్పుడు పీక్స్‌కు చేరింది.