News December 21, 2025

జగిత్యాల వ్యవసాయ మార్కెట్ ధరలు ఇలా..!

image

జగిత్యాల వ్యవసాయ మార్కెట్‌లో శనివారం పలికిన వివిధ దినుసుల ధరలు ఇలా ఉన్నాయి. మక్కలు క్వింటాల్‌కు గరిష్ఠ ధర రూ.1860, కనిష్ఠ ధర రూ.1559, వరి ధాన్యం 1010 గరిష్ఠంగా రూ.2015, కనిష్ఠ ధర రూ.1800, HMT గరిష్ఠ ధర రూ.2221, కనిష్ఠ ధర రూ.2221, జైశ్రీరాం వరి ధాన్యం గరిష్ఠ ధర రూ.2801, కనిష్ఠ ధర రూ.2500, ధర పలికిందని మార్కెట్ అధికారులు తెలిపారు.

Similar News

News December 31, 2025

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్

image

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజలందరికీ కలెక్టర్ జితేష్ వి.పాటిల్ కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2026వ సంవత్సరం జిల్లా ప్రజలందరి జీవితాల్లో సుఖసంతోషాలను, ఆయురారోగ్యాలను నింపాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందాలని, జిల్లా అభివృద్ధిలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని కోరారు. వేడుకలను క్రమశిక్షణతో, ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలన్నారు.

News December 31, 2025

అనకాపల్లి జిల్లాలో 92.45 శాతం పింఛన్లు పంపిణీ

image

అనకాపల్లి జిల్లాలో సాయంత్రం 5.42 గంటల వరకు 92.45 శాతం పింఛన్లు పంపిణీ చేసినట్లు డీఆర్డీఏ పీడీ శచీదేవి ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలో మొత్తం 2,55,680 మందికి పింఛన్లు పంపిణీ చేయాల్సి ఉండగా 2,36,385 మందికి అందజేసినట్లు పేర్కొన్నారు. సబ్బవరం మండలంలో అత్యధికంగా 95.93 మందికి పింఛన్లు పంపిణీ చేసామన్నారు. మిగిలిన వారికి ఈనెల రెండవ తేదీన పంపిణీ చేస్తామన్నారు.

News December 31, 2025

జగిత్యాల: నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్

image

జగిత్యాల జిల్లా ప్రజలందరికీ కలెక్టర్‌ బి.సత్యప్రసాద్‌ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. 2026 నూతన సంవత్సరం జిల్లాలోని ప్రతి ఇంట్లో ఆరోగ్యం, సుఖసంతోషాలు, శాంతి, సమృద్ధిని నింపాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ప్రజల భాగస్వామ్యం, సహకారం ఇలాగే కొనసాగాలని కోరారు. రాబోయే ఏడాదిలో జగిత్యాల జిల్లాను అగ్రస్థానంలో నిలపాలని ఆయన అధికారులకు సూచించారు.