News April 21, 2024

విశాఖ: ఏడుసార్లు పోటీ.. నాలుగుసార్లు గెలుపు

image

మాడుగుల టీడీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తికి చంద్రబాబు బీ-ఫారమ్ అందజేసిన సంగతి తెలిసిందే. ఏడుసార్లు టీడీపీ అభ్యర్థిగా పోటీచేసిన ఆయన.. నాలుగు సార్లు గెలిచారు. 1989, 1994 ,1999, 2004లో పరవాడ నుంచి పోటీ చేసి.. మూడుసార్లు గెలుపొందగా 2004లో ఓడిపోయారు. నియోజకవర్గాల పునర్విభజనతో 2009, 2014, 2019లో పెందుర్తి నుంచి పోటీచేయగా.. 2014లో గెలిచారు. 1997-98లో క్యాబినెట్ మంత్రిగా పనిచేశారు.

Similar News

News March 13, 2026

విశాఖ: బుకింగ్ చేసినా ఆలస్యంగా గ్యాస్ డెలివరీ..!

image

విశాఖలో గ్యాస్ సరఫరా తగ్గినట్లు గణాంకాలు చెబుతున్నాయి. జిల్లాలో మొత్తం 62 గ్యాస్ ఏజెన్సీలు ఉండగా సుమారు 9 లక్షల డొమెస్టిక్ కనెక్షన్లు ఉన్నాయి. రోజుకు 26,000 నుంచి 30,000 సిలిండర్లు డెలివరీ అయ్యేవి. అయితే ప్రస్తుతం రోజువారీ సరఫరా 16,000 నుంచి 19,000 సిలిండర్లకు తగ్గింది. సాధారణ పరిస్థితుల్లో సిలిండర్ 24 గంటల్లో అందుతుండగా, ప్రస్తుతం వినియోగదారులు 7 రోజుల వరకు వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

News March 13, 2026

మార్చి15న విశాఖకు మాజీ ఉపరాష్ట్రపతి

image

భారతదేశ మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు మార్చి 15న విశాఖ రానున్నారు.15న రాత్రి విశాఖ ఎయిర్ పోర్ట్‌కు చేరుకుని కిర్లంపూడి లేఅవుట్‌‌లోని తన నివాసంలో బస చేస్తారు. మార్చి 17న సాయంత్రం 6 గంటలకు కళాభారతి ఆడిటోరియంలో నిర్వహించే ఉగాది పురస్కార కార్యక్రమంలో పాల్గొంటారు. 19న ఉదయం విశాఖ నుంచి బయలుదేరి విజయవాడ వెళ్తారు.

News March 13, 2026

నేడు విశాఖ రానున్న డిప్యూటీ సీఎం పవన్

image

డిప్యూటీ సీఎం పవన్ నేడు విశాఖ రానున్నారు. సాయంత్రం 6 గంటలకు విశాఖ ఎయిర్ పోర్ట్‌కు చేరుకుని అక్కడి నుంచి రాడిసన్ బ్లూ హోటల్‌కు వెళ్తారు. రాత్రికి అక్కడే బస చేసి రేపు ఉదయం హెలికాప్టర్ ద్వారా అల్లూరి జిల్లాకి బయలుదేరుతారు. నందిగరువులో మాటామంతి కార్యక్రమంలో పాల్గొని తిరిగి రేపు మధ్యాహ్నం 2.15 గంటలకు అక్కడి నుంచి విశాఖ ఎయిర్ పోర్ట్‌కు చేరుకుంటారు. ఇక్కడి నుంచి బేగంపేటకు తిరుగు పయనమవుతారు.