News December 21, 2025
జగిత్యాల వ్యవసాయ మార్కెట్ ధరలు ఇలా..!

జగిత్యాల వ్యవసాయ మార్కెట్‌లో శనివారం పలికిన వివిధ దినుసుల ధరలు ఇలా ఉన్నాయి. మక్కలు క్వింటాల్‌కు గరిష్ఠ ధర రూ.1860, కనిష్ఠ ధర రూ.1559, వరి ధాన్యం 1010 గరిష్ఠంగా రూ.2015, కనిష్ఠ ధర రూ.1800, HMT గరిష్ఠ ధర రూ.2221, కనిష్ఠ ధర రూ.2221, జైశ్రీరాం వరి ధాన్యం గరిష్ఠ ధర రూ.2801, కనిష్ఠ ధర రూ.2500, ధర పలికిందని మార్కెట్ అధికారులు తెలిపారు.
Similar News
News January 8, 2026
మొక్కజొన్న కంకిలో చివరి వరకూ గింజలు రావాలంటే?

మొక్కజొన్న కంకిలో గింజలు నిండుగా రావాలంటే గింజలు పాలుపోసుకునే దశలో నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలి. పంటకు అవసరమైన నీటిని అందించాలి. అలాగే చివరి దఫా ఎరువుగా నిపుణుల సూచనల మేరకు పొటాష్ అందిస్తే గింజ గట్టిపడి పొత్తు బరువు పెరుగుతుంది. అలాగే పంటకు సిఫార్సు మేరకు యూరియా, ఇతర పోషకాలను సరైన మోతాదులో అందించాలి. మొక్కల మధ్య సరైన దూరం పాటిస్తే అన్ని మొక్కలకు పోషకాలు సమానంగా అందుతాయి.
News January 8, 2026
ఇవాళ మూసుకోనున్న శ్రీవారి వైకుంఠ ద్వారం

AP: ముక్కోటి ఏకాదశి సందర్భంగా తిరుమలలో గత నెల 30న తెరుచుకున్న శ్రీవారి వైకుంఠ ద్వారం ఇవాళ అర్ధరాత్రి 12 గంటలకు మూసివేయనున్నారు. ఇంతటితో వైకుంఠ ద్వార దర్శనాలు పూర్తి కానున్నాయి. మొత్తం 10 రోజుల్లో మొదటి 3 రోజులకు ఈ-డిప్ ద్వారా టోకెన్లు జారీ చేశారు. మిగతా 7 రోజుల్లో సర్వదర్శనానికి వచ్చిన భక్తులకు అవకాశం కల్పించారు. రేపటి నుంచి యథావిధిగా ప్రత్యేక దర్శనాలు తిరిగి ప్రారంభం కానున్నాయి.
News January 8, 2026
ఎంచివేస్తే, ఆరిక తరుగుతుందా?

కొందరు తమ దగ్గర ఉన్న సంపదను పదే పదే లెక్కబెడుతూ ఉంటారు. దాని గురించే ఆలోచిస్తూ ఉంటారు. నిరంతరం ఆ ధ్యాసలోనే బతుకుతారు. అయితే మన దగ్గర ఉన్న సంపద లేదా ధాన్యాన్ని ఎన్నిసార్లు లెక్కపెట్టినా అవి పెరిగిపోవు, తరగిపోవు. అవి మొదట ఎంత ఉన్నాయో, ఎన్నిసార్లు లెక్కించినా అంతే ఉంటాయి. వాటి గురించి పదే పదే ఆలోచన తగదు అని చెప్పే సందర్భంలో ఈ సామెత వాడతారు.


