News December 21, 2025

“మార్పు” కార్యక్రమం పటిష్ఠంగా అమలు చేయండి: కలెక్టర్

image

నాటుసారా తయారీదారులు ఆ పని నుంచి బయటకు తీసుకువచ్చి, ప్రత్యామ్నాయ ఉపాధితో గౌరవప్రదమైన జీవితాన్ని అందించేందుకు ఉద్దేశించిన “మార్పు” కార్యక్రమం మరింత పటిష్ఠంగా అమలయ్యేలా అధికారులు పర్యవేక్షించాలని కలెక్టర్ వెట్రి సెల్వి అధికారులను ఆదేశించారు.ఈ సందర్భంగా అధికారులతో టెలి కాన్ఫరెన్స్ ద్వారా శనివారం సమీక్షించారు. ఏలూరు జిల్లాను నాటు సారా రహిత జిల్లాగా రూపొందించినందుకు అధికారుల కృషి అభినందనీయమన్నారు.

Similar News

News December 26, 2025

గుంటూరు: రూ.53 లక్షల విలువైన సెల్‌ఫోన్ల రికవరీ

image

సుమారు రూ.53 లక్షల విలువైన 265 పోగొట్టుకున్న, దొంగతనానికి గురైన సెల్‌ఫోన్లను రికవరీ చేసి గుంటూరు ఎస్పీ వకుల్ జిందాల్ శుక్రవారం బాధితులకు అందజేశారు. ఇప్పటి వరకు సుమారు రూ.7.53 కోట్ల విలువైన 3,769 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేశామన్నారు. సెల్‌ఫోన్ల రికవరీ ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతుందని SP పేర్కొన్నారు.

News December 26, 2025

రేపు జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన

image

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శనివారం మహబూబాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం HYD నుంచి బయలుదేరి జిల్లా కేంద్రానికి చేరుకుంటారు. ఈ సందర్భంగా దివంగత మాజీ మంత్రి నూకల రామచంద్రారెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం డోర్నకల్‌ మండలంలో పర్యటించి, నూతనంగా నిర్మించిన బతుకమ్మ ఘాట్‌ మినీ ట్యాంక్‌బండ్‌ను ప్రారంభించనున్నారు. జిల్లాలో పలు అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.

News December 26, 2025

ప్రత్యేక PGRSలో అర్జీలను స్వీకరించిన కలెక్టర్

image

జిల్లా అభివృద్ధికి అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని బాపట్ల కలెక్టర్ డా.వి.వినోద్ కుమార్ తెలిపారు. కలెక్టరేట్‌లో శుక్రవారం నిర్వహించిన ఎస్టీలు, దివ్యాంగుల ప్రత్యేక PGRS కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఎస్టీలు, దివ్యాంగుల నుంచి ఆయన అర్జీలు స్వీకరించారు. వాటికి వెంటనే కలెక్టర్ పరిష్కార మార్గం చూపినట్లు వివరించారు.