News April 21, 2024

బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్ కింగ్స్

image

ఐపీఎల్-2024లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచులో పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.
PBKS: సామ్ కరన్(C), ప్రభ్‌సిమ్రాన్, రోసోవ్, లివింగ్‌స్టోన్, శశాంక్, జితేష్, అశుతోష్, హర్‌ప్రీత్ బ్రార్, హర్షల్, రబాడ, అర్ష్‌దీప్.
GT: సాహా, గిల్(C), మిల్లర్, ఒమర్జాయ్, షారుఖ్ ఖాన్, తెవాటియా, రషీద్, సాయి కిషోర్, నూర్ అహ్మద్, సందీప్ వారియర్, మోహిత్.

Similar News

News March 21, 2026

గోదావరిలో ఐదుగురు గల్లంతు.. మృతదేహాలు లభ్యం

image

TG: భద్రాచలం సమీపంలోని కొల్లుగూడెం ఇసుక ర్యాంప్ వద్ద గోదావరిలో గల్లంతైన ఐదుగురు యువకుల మృతదేహాలు లభ్యమయ్యాయి. చనిపోయిన వారిని శ్రీకర్, అభిరామ్, నవదీప్, సతీశ్, తేజగా గుర్తించారు. నిన్న ముగ్గురి మృతదేహాలు దొరకగా ఈరోజు మిగిలిన ఇద్దరి మృతదేహాలను గజ ఈతగాళ్లు బయటకు తీశారు. పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు.

News March 21, 2026

భారత్ – ఐర్లాండ్ మధ్య 2 టీ20లు

image

భారత్, ఐర్లాండ్ మధ్య రెండు టీ20ల షెడ్యూల్‌ను BCCI విడుదల చేసింది. జూన్ 26, 28వ తేదీల్లో 2 మ్యాచులు ఆడనున్నట్లు పేర్కొంది. 2 టీ20లూ బెల్‌ఫాస్ట్(ఐర్లాండ్) వేదికగా జరగనున్నాయి. భారత కాలమానం ప్రకారం రాత్రి 7.30 గంటలకు మ్యాచులు ప్రారంభం కానున్నాయి. 2007 తర్వాత ఈ వేదికలో భారత్ మళ్లీ ఇప్పుడే ఆడనుంది. ఆ వెంటనే జులై 1 నుంచి 11వ తేదీ వరకు భారత్-ఇంగ్లండ్ మధ్య 5టీ20లు జరగనున్నాయి.

News March 21, 2026

పిల్లి కోసం ఇద్దరు అమ్మాయిలు ఆత్మహత్య

image

హైదరాబాద్‌లో వేర్వేరు ఘటనల్లో పెంపుడు పిల్లుల కోసం ఇద్దరు విద్యార్థినులు తనువు చాలించడం విస్మయానికి గురిచేస్తోంది. పిల్లిని ఇంట్లోకి తేవొద్దన్నందుకు అల్వాల్‌కు చెందిన MBBS స్టూడెంట్ శ్రేష్ఠ నిన్న తల్లితో గొడవపడి సూసైడ్ చేసుకుంది. 3 రోజుల క్రితం మీర్‌పేట్‌లోనూ BSc విద్యార్థిని హిమబిందు పెంపుడు పిల్లి చనిపోయిందని ఆత్మహత్య చేసుకుంది. పెట్స్‌పై ప్రేమతో ప్రాణాలు తీసుకోవడంపై ఆందోళన వ్యక్తమవుతోంది.