News April 21, 2024

కసుమూరు దర్గాలో సినీ హీరో సుమన్ పూజలు

image

దక్షిణ భారతదేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కసుమూరు మస్తాన్ వలి దర్గాను ఆదివారం ప్రముఖ సినీ నటుడు సుమన్ దర్శించుకున్నారు. దర్గా ముజావర్లు ఆయనకు ఘన స్వాగతం పలికారు. హీరో సుమన్ పేరిట ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో కేఎస్ అసిఫ్, ఎంఎస్ మొహమ్మద్, ఎంఎస్ దస్తగిరి, రహీద్ తదితరులు పాల్గొన్నారు.

Similar News

News October 11, 2025

నెల్లూరు జిల్లాలో 30% మంది ఉబకాయం

image

ప్రస్తుత కాలంలో ఊబకాయం (Obesity) ప్రమాదకరంగా మారింది. గుండె, మధుమేహం, రక్తపోటు వంటి వ్యాధులకు ఇది ప్రధాన కారణమవుతోంది. ఆహార అలవాట్లు, వ్యాయామం లేకపోవడం, జంక్ ఫుడ్స్ అధికంగా తినడం వల్ల పెద్దలతో పాటు చిన్నారులు కూడా ఊబకాయంతో బాధపడుతున్నారు. నెల్లూరు జిల్లాలో 30% మంది ఊబకాయులు ఉండగా, వారిలో సగం మహిళలేనని అధ్యయనం తెలిపింది. పిల్లల్లో 25% మందికి ఈసమస్య ఉంది. రోజు వ్యాయామం చేయాలని నిపుణులు అంటున్నారు.

News October 11, 2025

గ్యాంగ్ రేప్ కేసులో జిల్లా కోర్టు సంచలన తీర్పు

image

ఉమ్మడి నెల్లూరు(G) సూళ్లూరుపేటలో 2019లో జరిగిన గ్యాంగ్ రేప్ కేసులో నెల్లూరు 8వ అదనపు కోర్టు న్యాయమూర్తి MA సోమశేఖర్ ఇద్దరికి జీవిత ఖైదు విధిస్తూ సంచలన తీర్పు వెలువరించారు. ముద్దాయిలు ఇద్దరు సూళ్లూరుపేట బొగ్గుల కాలనీకి చెందిన తిరువల్లూరు నవీన్ కుమార్, సాయి నగర్‌కు చెందిన కేకుల దేవకు జీవిత ఖైదీ విధించారు. దీంతోపాటు నగదు దోపిడీకి పాల్పడినందుకు పదేళ్లు కఠిన కారాగార శిక్ష, రూ.2 వేలు జరిమానా విధించారు.

News October 11, 2025

కావలి రైతుబజారులో ఆధునికరణ

image

కావలి రైతు బజార్‌ను ఆధునికరించే దిశగా అడుగులు పడుతున్నాయి. మార్కెట్లో ఇప్పటికే శిథిలావస్థకు గురైన దుకాణాలలో తొలగించారు. వర్షం నుంచి రక్షణగా రూఫ్ టాప్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే రూ.45 లక్షలతో పనులు వారం కిందటే ప్రారంభమయ్యాయి. కొత్తగా దుకాణాల నిర్మాణం, విద్యుత్ సౌకర్యం, మరుగుదొడ్లు, పెయింటింగ్ పనులు తదితర వాటికి మరో రూ.50 లక్షలు ఖర్చు కానున్నట్లు సమాచారం.