News December 21, 2025

NRPT: పొగమంచుతో ప్రయాణం.. జాగ్రత్తలు అవసరం: ఎస్పీ

image

వాతావరణంలో పొగమంచు తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ సూచించారు. వీలైనంత వరకు రాత్రి, తెల్లవారుజామున ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని కోరారు. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రయాణించాల్సి వస్తే, వాహనాల హెడ్ లైట్లు ఆన్ చేసి, తక్కువ వేగంతో వెళ్లాలని తెలిపారు. రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తూ సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలన్నారు.

Similar News

News January 5, 2026

పుట్టపర్తి ఎస్పీ కార్యాలయానికి 85 ఫిర్యాదులు

image

పుట్టపర్తి ఎస్పీ కార్యాలయంలో జిల్లా ఎస్పీ సతీశ్ కుమార్ సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ఎక్కువగా కుటుంబ కలహాలు, ఆస్తి తగాదాలు, ఆర్థిక వివాదాలు, భూ సమస్యలు తదితర అంశాలపై వచ్చిన ప్రజల నుంచి 85 ఫిర్యాదులు స్వీకరించినట్లు అధికారులు తెలిపారు. జిల్లాలోని పోలీస్ అధికారులు సంబంధిత ఫిర్యాదులపై ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టి పరిష్కరించాలని ఎస్పీ సంబంధిత అధికారులను ఆదేశించారు.

News January 5, 2026

అనకాపల్లి: ప్రజా ఫిర్యాదుల వేదికలో 47అర్జీలు

image

అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల వేదిక (PGRS)లో మొత్తం 47 అర్జీలు స్వీకరించారు. ఎస్పీ తుహిన్ సిన్హా ఆదేశాల మేరకు జిల్లా అదనపు ఎస్పీ ఎం.దేవ ప్రసాద్ ఫిర్యాదులను స్వీకరించారు. భూతగాదాలు 22, కుటుంబ కలహాలు 3, మోసపూరిత కేసులు 2, ఇతర విభాగాలవి 20 ఫిర్యాదులు అందాయి. ప్రతి ఫిర్యాదును నిష్పక్షపాతంగా 7 రోజుల్లో పరిష్కరించాలని ఆయన అధికారులు ఆదేశించారు.

News January 5, 2026

సంగారెడ్డి: మైనార్టీ మహిళలకు కొత్త పథకాలు

image

మైనార్టీ మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం ‘రేవంత్ అన్నా కా సహారా – మిస్కీన్ కేలియే’, ‘ఇందిరమ్మ మైనార్టీ’ అనే రెండు ప్రత్యేక పథకాలను ప్రవేశపెట్టిందని సంగారెడ్డి జిల్లా మైనార్టీ అధికారి విశాలాక్షి తెలిపారు. ఈ పథకాలకు అర్హులైన వారు ఈనెల 10లోగా <>ఆన్‌లైన్‌<<>>లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తు పత్రాలను సంబంధిత ఎంపీడీవో కార్యాలయాల్లో సమర్పించాలని, మైనార్టీ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.