News December 21, 2025

డిసెంబర్ 21: చరిత్రలో ఈరోజు

image

✤ 1926: సినీ నటుడు అర్జా జనార్ధనరావు జననం
✤ 1939: నటుడు సూరపనేని శ్రీధర్ జననం
✤ 1959: భారత మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ జననం
✤ 1972: ఏపీ మాజీ సీఎం వై.ఎస్.జగన్ రెడ్డి జననం(ఫొటోలో)
✤ 1972: నటి, నిర్మాత దాసరి కోటిరత్నం మరణం
✤ 1989: నటి తమన్నా భాటియా జననం

Similar News

News December 28, 2025

జెప్టో.. రూ.11 వేల కోట్లకు IPO

image

క్విక్ కామర్స్ దిగ్గజం జెప్టో పబ్లిక్ ఇష్యూ కోసం సెబీకి డాక్యుమెంట్లు సమర్పించింది. ఈ IPO ద్వారా సుమారు రూ.11వేల కోట్లను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2026లో మార్కెట్లో లిస్టింగ్ కావాలని భావిస్తోంది. కాగా 2020లో అదిత్, కైవల్య ఈ స్టార్టప్‌ను ప్రారంభించారు. ప్రస్తుతం దీని విలువ 7 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇప్పటికే దీని పోటీదారులైన స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, బ్లింకిట్ (జొమాటో) లిస్ట్ అయ్యాయి.

News December 28, 2025

కేజీ చికెన్ రూ.300.. మాంసం ప్రియులకు షాక్

image

తెలుగు రాష్ట్రాల్లో గత వారంతో పోలిస్తే చికెన్ ధరలు పెరిగాయి. హైదరాబాద్‌లో కేజీ స్కిన్ లెస్ చికెన్ రూ.300గా ఉంది. విజయవాడలో కేజీ రూ.280, వరంగల్‌లో రూ.290, గుంటూరులో రూ.260, శ్రీకాకుళంలో రూ.305కి విక్రయిస్తున్నారు. గత వారం HYDలో కేజీ రూ.250 ఉండగా ఇప్పుడు రూ.50 వరకు పెరిగింది. న్యూ ఇయర్ సందర్భంగా మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. అటు కోడిగుడ్డు ధర రూ.8గా ఉంది.

News December 28, 2025

డిగ్రీ అర్హతతో 451 పోస్టులు.. అప్లై చేశారా?

image

త్రివిధ దళాల్లో 451 ఆఫీసర్ పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. CDSE-2026 ద్వారా UPSC వీటిని భర్తీ చేయనుంది. ఇంజినీరింగ్, డిగ్రీ ఉత్తీర్ణులై, 20 -24ఏళ్ల మధ్య వయసు గలవారు అర్హులు. దరఖాస్తు ఫీజు రూ.200. SC, ST, మహిళలకు ఫీజు లేదు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: upsconline.nic.in. *మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.