News December 21, 2025
జాగ్రత్త.. వణికించేస్తున్న చలి

తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. నిన్న తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా కోహీర్‌లో అత్యల్పంగా 4.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇవాళ ఉ.8.30 గంటల వరకు బయటకు రావొద్దని IMD 11 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అటు APలోని అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగులలో నిన్న కనిష్ఠ ఉష్ణోగ్రత 4.7 డిగ్రీలుగా నమోదైంది. అరకులో 5.8, పాడేరులో 6.7, డుంబ్రిగుడలో 9.1గా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
Similar News
News January 13, 2026
‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ పబ్లిక్ టాక్

రవితేజ-కిశోర్ తిరుమల కాంబోలో రూపొందిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రం ఇవాళ రిలీజైంది. విదేశాల్లో ప్రీమియర్స్ చూసిన ప్రేక్షకులు తమ అనుభవాలను SM వేదికగా పంచుకుంటున్నారు. ‘స్టోరీ, స్క్రీన్ ప్లే రొటీన్‌లా అనిపించినా ఫస్ట్ హాఫ్‌లో కామెడీ మెప్పిస్తుంది. పాటలు ఆకట్టుకుంటాయి. కొన్ని సన్నివేశాలు కాస్త సాగదీతగా అనిపిస్తాయి’ అని కామెంట్స్ చేస్తున్నారు. కాసేపట్లో Way2Newsలో మూవీ రివ్యూ&రేటింగ్.
News January 13, 2026
స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర ప్రోగ్రామ్ వాయిదా

AP: రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 17వ తేదీ జరగాల్సిన స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర ప్రోగ్రాం వాయిదా పడింది. సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని వాయిదా వేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. పండుగ వేళ ప్రజలు, ప్రభుత్వ ఉద్యోగులు కుటుంబాలతో కలిసి ఉంటారని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రతి నెలా మూడో శనివారం జరగాల్సిన కార్యక్రమాన్ని జనవరిలో నాలుగో శనివారం నిర్వహించనున్నారు.
News January 13, 2026
నిమ్మకు డ్రిప్ విధానంలో నీరు అందిస్తే మేలు

నిమ్మలో పూత, పిందె, పండు అభివృద్ధి దశలో తప్పనిసరిగా నీరు అందించకుంటే దిగుబడి తగ్గే అవకాశం ఉంటుంది. నిమ్మ తోటలకు డ్రిప్ ద్వారా నీరు అందించడం మంచిదంటున్నారు నిపుణులు. దీని వల్ల 14-25% వరకు నీరు ఆదా అవడంతో పాటు కలుపు 30% తగ్గుతుంది. నీటిలో తేమ ఎక్కువ రోజులుండి కాయ నాణ్యత, దిగుబడి పెరిగి తెగుళ్ల వ్యాప్తి తగ్గుతుంది. ఎరువులను కూడా డ్రిప్ విధానంలో అందించవచ్చు. దీని వల్ల కూలీల ఖర్చును తగ్గించుకోవచ్చు.


