News December 21, 2025

నేడే ఫైనల్.. వీళ్లు చెలరేగితే విజయం ఖాయం!

image

అండర్-19 ఆసియా కప్‌ వన్డే టోర్నీ ఆఖరి మజిలీకి చేరుకుంది. టీమ్ ఇండియా యంగ్‌స్టర్స్ నేడు దాయాది దేశంతో తలపడనున్నారు. ఇవాళ సూర్యవంశీ, అభిజ్ఞాన్ కుందు మరోసారి చెలరేగితే భారత్‌కు విజయం సునాయాసం అవుతుంది. ఈ టోర్నీలో ఇప్పటివరకు టీమ్ ఇండియా అన్ని గ్రూప్ మ్యాచుల్లో గెలిచింది. సెమీస్‌లో అయితే శ్రీలంకపై 8 వికెట్ల తేడాతో ఘన విజయం నమోదు చేసింది. ఇప్పటికే పాక్‌ను ఒకసారి 90 రన్స్ తేడాతో ఓడించింది.

Similar News

News January 8, 2026

మెట్రో, RTC, MMTSకి ఒకే టికెట్

image

TG: మెట్రో, MMTS, RTC సేవలను అనుసంధానం చేసే కీలక ప్రణాళిక రూపుదిద్దుకుంటోంది. నెలరోజుల్లో ఈ ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్‌పోర్ట్ విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని అధికారులు కసరత్తు చేస్తున్నారు. మెట్రో, ఎంఎంటీఎస్ స్టేషన్లలో దిగిన ప్రయాణికులు నేరుగా తమ గమ్యస్థానాలకు చేరుకునేలా ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉంటాయి. మూడు రవాణా సేవలకు కలిపి ఒకే టికెట్ విధానాన్ని కూడా ప్రవేశపెట్టే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి.

News January 8, 2026

ఇల్లు కట్టుకోవాలనుకునే వారికి గుడ్ న్యూస్

image

TG: ఏప్రిల్‌లో మరో విడత ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.22,500 కోట్లతో 4.5 లక్షల ఇళ్లు నిర్మించామని తెలిపారు. ప్రతి అర్హుడైన పేదవాడికి ఇల్లు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఏటా 2 విడతలుగా ఇళ్ల మంజూరు కొనసాగుతుందని, లబ్ధిదారులకు ప్రతి సోమవారం బిల్లులు చెల్లిస్తున్నామని అన్నారు.

News January 8, 2026

నేడు ఈ వస్తువులు దానం చేస్తే అదృష్టం

image

విష్ణువుకు ఇష్టమైన గురువారం నాడు పసుపు రంగు వస్తువులు దానమిస్తే జాతకంలో బృహస్పతి దోషాలు తొలగి, ఆర్థిక స్థితి మెరుగుపడుతుందని నమ్మకం. పేదలకు పసుపు వస్త్రాలు, పప్పు ధాన్యాలు, అరటిపండ్లు, పసుపు మిఠాయిలను దానం చేయాలని పండితులు సూచిస్తున్నారు. దీనివల్ల వృత్తిలో పురోగతి లభించడమే కాకుండా, ఇంట్లో సిరిసంపదలు పెరుగుతాయని అంటున్నారు. స్తోమతను బట్టి చేసే దానం, విష్ణుమూర్తి కృపతో శుభాలను చేకూరుస్తుంది.