News December 21, 2025

కర్నూలు: నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు.. ఐదుగురి తొలగింపు

image

తెలుగు గంగ/సోమశిల ప్రాజెక్టు నిర్వాసితుల కోటాలో నకిలీ సర్టిఫికెట్లు చూపించి ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన ఐదుగురిని సేవల నుంచి తొలగించారు. ఈ వ్యవహారంపై వచ్చిన ఫిర్యాదును విచారించిన ఉప లోకాయుక్త పి.రజని ఆదేశాలతో తిరుపతిలోని ఎన్టీఆర్ తెలుగు గంగ ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్ తక్షణ చర్యలు చేపట్టారు. నిబంధనల ఉల్లంఘన స్పష్టంగా తేలడంతో ఉద్యోగులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని పోలీసులకు సూచించారు.

Similar News

News December 27, 2025

కరీంనగర్‌: నూతన సర్పంచులను సన్మానించిన మంత్రి

image

ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచులను రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ సన్మానించారు. కరీంనగర్‌లోని డీసీసీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. నూతనంగా ఎన్నికైన సర్పంచులు గ్రామాభివృద్ధే లక్ష్యంగా పనిచేయాలని, సంక్షేమ ఫలాలు అర్హులందరికీ అందేలా కృషిచేయాలని సూచించారు. MLAలు మేడిపల్లి సత్యం, కవ్వంపల్లి ఉన్నారు.

News December 27, 2025

అక్రమ రవాణాపై పోలీసుల ఉక్కుపాదం: సీపీ సునీల్ దత్

image

ఖమ్మం జిల్లాలో అక్రమ రవాణా, చట్టవ్యతిరేక కార్యకలాపాల కట్టడికి విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నట్లు CP సునీల్ దత్ తెలిపారు. సరిహద్దు రాష్ట్రాల నుంచి గంజాయి, ఇసుక, రేషన్ బియ్యం తరలించే ముఠాలపై ప్రత్యేక నిఘా ఉంచామన్నారు. ఇందులో భాగంగా తనిఖీలను ముమ్మరం చేసినట్లు వెల్లడించారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకుంటామని, అలాగే డ్రంక్&డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన వారిపై కేసులు నమోదు చేశామన్నారు.

News December 27, 2025

R&R ప్యాకేజీపై కలెక్టర్ సీరియస్.. ‘పంపిణీలో జాప్యం వద్దు’

image

పాడేరు: పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల పునరావాస(R&R) ప్యాకేజీ పంపిణీని త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ.. పంపిణీలో అలసత్వం వహించరాదని స్పష్టం చేశారు. నిర్వాసితులను అయోమయానికి గురిచేస్తూ తప్పుడు ప్రచారం చేసే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఈ సందర్భంగా హెచ్చరించారు.