News December 21, 2025
నేషనల్స్‌లో బాపట్ల జిల్లా యువకుడి సత్తా.!

బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఈనెల 16 నుంచి 20 వరకు నిర్వహించిన బంగ్లాదేశ్ ఓపెన్ ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ పోటీల్లో చీరాల యువకుడు విజయం సాధించాడు. మెన్స్ సింగిల్స్ విభాగంలో యువకుడు షేక్ నోమాయెర్ ద్వితీయ స్థానాన్ని సాధించాడు. ఈ పోటీల్లో అద్భుత ప్రతిభ కనబరిచిన షేక్ నోమాయెర్ రన్నరప్‌గా నిలిచి 850 అమెరికన్ డాలర్ల ప్రైజ్ మనీని సొంతం చేసుకున్నాడు.
Similar News
News January 24, 2026
మద్దూరులో యువకుడి ఆత్మహత్య

మద్దూరు మండలం అప్పిరెడ్డిపల్లిలో భీమేశ్ (19) అనే యువకుడు చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. శనివారం ఉదయం పొలానికి వెళ్లే దారిలో మృతదేహాన్ని గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని ఎస్ఐ విజయ్ కుమార్ తెలిపారు.
News January 24, 2026
రథ సప్తమి పూజ ఎలా చేయాలంటే..?

రథసప్తమి నాడు సూర్యరశ్మి పడే చోట ఆవు పేడతో శుద్ధి చేయాలి. పిడకల పొయ్యి పెట్టాలి. ఇత్తడి పాత్రలో ఆవు పాలను పొంగించాలి. పాలు పొంగే సమయంలో కొత్త బియ్యం, బెల్లంతో పరమాన్నం చేయాలి. దాన్ని చిక్కుడాకుల్లో సూర్యుడికి నివేదించాలి. అనంతరం అందరికీ వితరణ చేస్తే మంచి జరుగుతుందని నమ్మకం. అలాగే చిక్కుడు కాయలు, కొబ్బరి పుల్లలతో చిన్న రథాన్ని తయారు చేసి పూజించాలి. పాలు పొంగడం ఇంటి అభివృద్ధికి సంకేతంగా భావిస్తారు.
News January 24, 2026
శబరిమలలో మూవీ షూటింగ్? విచారణకు ఆదేశం!

అయ్యప్ప సన్నిధానంలో నిబంధనలకు విరుద్ధంగా సినిమా షూటింగ్ జరిగిందన్న ఆరోపణలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. మలయాళ డైరెక్టర్ అనురాజ్ మనోహర్ నిషేధిత ప్రాంతంలో వీడియోగ్రఫీ చేశారన్న ఫిర్యాదుపై ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డ్ విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. షూటింగ్‌కు అనుమతి అడిగినా బోర్డు నిరాకరించిందని అధికారులు స్పష్టం చేశారు. అయితే తాము పంబలో మాత్రమే వీడియో తీశామని మనోహర్ తెలిపారు.


