News December 21, 2025
SRD: ఇంటర్ పూర్తి.. 21 ఏళ్లకే సర్పంచ్

ఖేడ్ మండలంలోని లింగ నాయక్ పల్లి గ్రామపంచాయతీ 2024లో ఏర్పడింది. గ్రామంలో 279 ఓటర్లు ఉన్నారు. మొదటిసారి జరిగిన పంచాయతీ ఎన్నికల్లో గ్రామానికి చెందిన 21 ఏళ్ల తంపులూరి శివలక్ష్మి సమీప ప్రత్యర్థి పుల్లయ్య గారి లక్ష్మిపై 84 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. శివలక్ష్మి ఇంటర్మీడియట్ పూర్తి చేసింది. కాగా ఖేడ్ మండలంలో అత్యంత తక్కువ ఉన్న వయస్సు సర్పంచ్‌గా శివలక్ష్మి రికార్డ్ సృష్టించింది.
Similar News
News December 26, 2025
ఢిల్లీకి చేరుకున్న సీఎం రేవంత్

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి చేరుకున్నారు. రేపు జరిగే CWC సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. ఎల్లుండి కాంగ్రెస్ పెద్దలతో సమావేశమై క్యాబినెట్ విస్తరణ, నామినేటెడ్ పోస్టులపై చర్చించనున్నట్లు సమాచారం.
News December 26, 2025
అసెంబ్లీకి కేసీఆర్?

TG: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ నెల 29 నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇవాళ ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో మాజీ మంత్రులతో సమావేశంలో చెప్పినట్లు సమాచారం. సభలో ప్రభుత్వాన్ని ప్రశ్నించడంపై వారికి దిశానిర్దేశం చేశారు. ఇందులో భాగంగానే ఆయన కూడా అసెంబ్లీకి వచ్చి సర్కార్‌ను ఇరుకున పెట్టాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలో క్లారిటీ రానుంది.
News December 26, 2025
పిడుగురాళ్ల: టోల్ ప్లాజ్ వద్ద ఘోర ప్రమాదం.. ఒకరు స్పాట్ డెడ్

పిడుగురాళ్ల మండలం తుమ్మలచెరువు టోల్ ప్లాజా వద్ద శుక్రవారం రాత్రి గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో బైకుపై వెళ్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని విచారిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


