News December 21, 2025

అనంతపురంలో గన్ కలకలం

image

అనంతపురంలో జిమ్ ఓనర్ రాజశేఖర్ రెడ్డి వద్ద గన్ లభించండం కలకలం రేపింది. ఈనెల 11న తనను హింసిస్తూ గన్‌తో బెదిరించినట్లు ఆయన భార్య మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు గన్ స్వాధీనం చేసుకొని విచారించారు. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో గన్ కొన్నట్లు తేలడంతో ప్రత్యేక బృందాలు అక్కడికి వెళ్లి ఆయుధాల తయారీదారులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారిని అనంతపురం తీసుకొస్తున్నట్లు సమాచారం.

Similar News

News January 12, 2026

మేడారం: కనుమరుగవుతున్న ఎడ్ల బండి సంప్రదాయం!

image

ఒకప్పుడు మేడారం జాతర అంటే ఉమ్మడి వరంగల్ జిల్లా నలుమూలల నుంచి చిన్నా, పెద్దా తేడా లేకుండా ఎడ్ల బండ్లలో భక్తులు తరలివెళ్లే దృశ్యాలు కనువిందు చేసేవి. గ్రామీణ సంస్కృతి, భక్తి భావన కలగలిసి సాగిన ఆ యాత్రకు ప్రత్యేకమైన వైభవం ఉండేది. అయితే కాలానుగుణ మార్పులు, రోడ్డు విస్తరణలు, రవాణా సౌకర్యాల పెరుగుదలతో ఇప్పుడు ప్రత్యేక బస్సులు, కార్లు మేడారం జాతరకు బైలెల్లుతున్నాయి.

News January 12, 2026

హనుమకొండ: చైనా మాంజా.. 36 కేసులు నమోదు

image

పక్షులతోపాటు ప్రజలకు ప్రమాదకరంగా మారిన నిషేధిత చైనా మాంజా సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గత డిసెంబర్ మాసం నుంచి ఇప్పటి వరకు 36 మందిపై కేసులు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. సూమారు రూ.12 లక్షల విలువైన చైనా మాంజాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

News January 12, 2026

పుష్కరాల్లోగా ‘పోలవరం’ జాతికి అంకితం: CBN

image

AP: గోదావరి పుష్కరాల్లోగా పోలవరం ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తామని మంత్రులు, కార్యదర్శుల సమావేశంలో CM CBN ప్రకటించారు. ‘ఇది పూర్తయితే దక్షిణ భారత్‌లో ఏ రాష్ట్రమూ మనతో పోటీపడలేదు. ఏటా 3వేల TMCల గోదావరి నీరు వృథాగా సముద్రంలోకి పోతోంది. 2 తెలుగు రాష్ట్రాలూ ఈ జలాలను సమర్థంగా వినియోగించుకోవచ్చు. పోలవరంలో మిగిలే నీళ్లను TG కూడా వినియోగించుకోవచ్చు. నల్లమల సాగర్‌తో ఎవరికీ నష్టం లేదు ’ అని CM తెలిపారు.