News December 21, 2025

ADB: PG విద్యార్థులకు ఆదివారం తరగతులు

image

డా.బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ పరిధిలో పీజీ మొదటి రెండవ సంవత్సరం విద్యార్థులకు కాంటాక్ట్ కం కౌన్సెలింగ్ తరగతులను నిర్వహిస్తున్నట్లు ఆదిలాబాద్ ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్, వర్సిటీ ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ జగ్రామ్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో ఉన్న వర్సిటీ అధ్యయన కేంద్రంలో ఈ నెల 21న ఈ తరగతులు ఉంటాయని పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లా విద్యార్థులు తరగతులకు హాజరుకావాలని సూచించారు.

Similar News

News January 9, 2026

యాదగిరిగుట్ట కేంద్రంగా భారీ కుంభకోణం..!

image

భూభారతి పోర్టల్‌లోని ‘ఎడిట్’ ఆప్షన్‌ను ఆసరాగా చేసుకుని ఓ కేటుగాడు భారీ మోసానికి తెరలేపాడు. యాదగిరిగుట్టకు చెందిన ఇంటర్‌నెట్ సెంటర్ నిర్వాహకుడు రిజిస్ట్రేషన్ ఫీజుల రూపంలో ప్రభుత్వానికి చెల్లించాల్సిన రూ.లక్షల సొమ్మును రూ.వందలకే మార్చి ఖజానాకు గండికొట్టాడు. ఈ ఘటన జనగామలో వెలుగు చూడగా తహశీల్దార్ ఫిర్యాదుతో వరంగల్ CCS పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

News January 9, 2026

భద్రాద్రి: ఆ విషాదానికి 29 ఏళ్లు

image

కరకగూడెం పోలీస్‌ స్టేషన్‌పై మావోయిస్టుల దాడి జరిగి నేటికి 29 ఏళ్లు పూర్తయ్యాయి. 1997JAN 9న అర్ధరాత్రి మావోయిస్టులు స్టేషన్‌పై విరుచుకుపడ్డారు. భవనాన్ని పేల్చివేసి, విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో 16 మంది పోలీసులు అమరులయ్యారు. అనంతరం స్టేషన్‌లోని ఆయుధాలను వారు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన నాటి ఉమ్మడి ఏపీలో సంచలనం సృష్టించింది. నేటికీ ఆ ఘటనను తలుచుకుంటే స్థానికులు, మృతుల కుటుంబ సభ్యులు ఉలిక్కిపడుతుంటారు.

News January 9, 2026

కృష్ణా: Way2Newsలో రిపోర్టర్‌గా చేరాలనుకుంటున్నారా.!

image

కృష్ణా జిల్లాలోని పామర్రు, గుడివాడ, పెనమలూరు నియోజకవర్గాల్లో Way2Newsలో పనిచేయాడానికి రిపోర్టర్2లు కావలెను. ఆర్హత.. ఏదైనా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేసిన అనుభవం ఉన్న వాళ్లకు మాత్రమే. ఆసక్తి గలవారు ఈ <>లింక్‌లో<<>> తమ పేర్లు నమోదు చేసుకోగలరు.