News December 21, 2025

‘అగ్నాస్త్రం’ తయారీ విధానం, వినియోగం

image

పొగాకు, వేపాకు, పచ్చి మిరపకాయలు, వెల్లుల్లిని మెత్తగా నూరి ఒక పాత్రలో వేసి 10 లీటర్ల ఆవు మూత్రం కలపాలి. దీన్ని పొయ్యి మీద 5 పొంగులు వచ్చే వరకు ఉడికించాలి. తర్వాత పొయ్యి మీద నుంచి దించి గుడ్డ/గన్నీ సంచితో కప్పాలి. 48 గంటలు చల్లారాక వడగట్టి భద్రపరుచుకోవాలి. అవసరమైన సమయంలో ఎకరానికి 100 లీటర్ల నీటిలో 2 లేదా రెండున్నర లీటర్ల అగ్నాస్త్రం కలిపి పంటలపై పిచికారీ చేయాలి. ఇది 3 నెలల పాటు నిల్వ ఉంటుంది.

Similar News

News January 1, 2026

ఎల్లుండి సూపర్ మూన్

image

ఈ ఏడాది తొలి పౌర్ణమిన సూపర్ మూన్ ఎల్లుండి కనువిందు చేయనుంది. జనవరి 3న సాయంత్రం 6 గంటలకు చంద్రుడు మరింత పెద్దగా కనిపించనున్నాడు. సాధారణం కంటే 15శాతం బిగ్గర్‌గా 30శాతం ప్రకాశవంతంగా దర్శనమిస్తాడు. ఈ అద్భుత దృశ్యాన్ని నేరుగా చూడవచ్చు. కాగా సూపర్‌మూన్ గత 4 నెలలుగా వరుసగా కనిపిస్తుండటం గమనార్హం. OCT, NOV, DECలోనూ కనువిందు చేసింది. ఇక ఈసారి సూపర్ మూన్ చూడటం మిస్ అయితే నవంబర్ వరకూ ఆగాల్సిందే.

News January 1, 2026

అందుకే దాస్‌పై ఆరోపణలు: CM రేవంత్

image

TG: పాలమూరు-RR ప్రాజెక్టు వివాదం వేళ వార్తల్లో నిలిచిన ఇరిగేషన్ సలహాదారు <<18689807>>ఆదిత్యనాథ్<<>> దాస్ గురించి CM రేవంత్ మీడియా సమావేశంలో ప్రస్తావించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులపై ఆయనకు అవగాహన ఉండటంతోనే AP నుంచి తీసుకొచ్చామన్నారు. ఆయనది అటు ఏపీ, ఇటు తెలంగాణ కాదని, దాస్ బిహార్‌కు చెందినవాడని తెలిపారు. కేసీఆర్, హరీశ్ రావు దొంగతనాన్ని బయటపెడతాడనే భయంతోనే ఆయనపై BRS నేతలు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.

News January 1, 2026

మద్యం విక్రయాలకు న్యూ ఇయర్ కిక్కు

image

AP: మద్యం అమ్మకాలు డిసెంబర్(2025)లో గణనీయంగా పెరిగి ₹2,767 కోట్ల ఆదాయం సమకూరింది. 2024లో ఇదే నెలలో ₹2,568 కోట్లు వచ్చాయి. న్యూ ఇయర్ వేడుకలు, వరుస సెలవుల రాకతో 29, 30, 31 తేదీల్లో ఏకంగా ₹543 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. 2024లో ఇది ₹336 కోట్లు మాత్రమే. అత్యధికంగా విశాఖపట్నం జిల్లాలో ₹178.6 కోట్ల విలువైన మద్యాన్ని మందుబాబులు కొనుగోలు చేశారు.