News December 21, 2025

కొండగట్టుకు మరోసారి రానున్న పవన్ కళ్యాణ్..?

image

ప్రసిద్ద పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానానికి AP డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ మరోసారి వస్తున్నట్లు సమాచారం. శనివారం TTD ఇంజనీరింగ్ విభాగానికి చెందిన అధికారులు కొండగట్టులో దీక్షా మండపం, 96 విశ్రాంత గదుల నిర్మాణానికి స్థల పరిశీలన చేశారు. త్వరలోనే ముహూర్తం ఖరారు చేసి, శంకుస్థాపన నిర్వహిస్తామన్నారు. అయితే, ఈ శంకుస్థాపనకు పవన్ కళ్యాణ్ వస్తారని TTD అధికారులు వెల్లడించినట్లు సమాచారం.

Similar News

News January 13, 2026

అన్నమయ్య: నకిలీ బంగారం ముఠా.. గుట్టురట్టు..!

image

చిన్నమండెం మండలంలో నిర్వహించిన మెరుపు దాడిలో ఆరుగురు అంతర్రాష్ట్ర మోసగాళ్ల అరెస్టయ్యారు. రూ.3 లక్షల నగదు, ఒక కారు, 2 కేజీల నకిలీ బంగారం, 170 మిల్లీగ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయినవారిలో వీరబల్లి, తమిళనాడుకు చెందిన నిందితులు ఉన్నారు. నకిలీ బంగారం విక్రయం, ప్రోత్సహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.

News January 13, 2026

కడప జిల్లాలో పోస్టింగ్.. భర్త SP.. భార్య JC.!

image

కడప JCగా నూతనంగా నిధి మీనా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈమె ప్రస్తుతం కడప జిల్లా ఎస్పీగా పనిచేస్తున్న షెల్కే నచికేత్ విశ్వనాథ్ సతీమణి. ఈమెది 2019 ఐఏఎస్ బ్యాచ్. మొదటగా తెనాలి సబ్ కలెక్టర్‌గా పనిచేశారు. ఆ తర్వాత వయోజన విద్య డైరెక్టర్‌గా, ఎన్టీఆర్ JCగా విధులు నిర్వహించారు. ఇప్పటివరకు కడప JCగా పనిచేసిన అదితిసింగ్ ప్రసూతి సెలవులో ఉన్నారు.

News January 13, 2026

తెలంగాణలో ‘కొత్త’ పంచాయితీ!

image

రాష్ట్రంలో జిల్లాలు మరోసారి మారే అవకాశం ఉంది. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత 2016లో నాటి CM KCR జిల్లాలను విభజించారు. కానీ అది శాస్త్రీయంగా జరగలేదని, స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసమే ఇలా చేశారని ప్రస్తుత CM రేవంత్ ఆరోపించారు. వాటిని సరిచేసేందుకు కమిటీ వేస్తామన్నారు. అయితే ప్రజలకు పాలన దగ్గర చేయాలనే కొత్త జిల్లాలు తెచ్చామని, వాటిని ముట్టుకుంటే అగ్గి రాజేస్తామన్న KTR మాటలతో రాజకీయ దుమారం మొదలైంది.