News December 21, 2025
కానిస్టేబుళ్లకు తిరుపతి ఎస్పీ సూచనలు

తిరుపతి జిల్లాలో నూతనంగా ఎంపికైన పోలీస్ కానిస్టేబుళ్లకు ఎస్పీ ఎల్.సుబ్బరాయుడు మార్గదర్శకాలు జారీ చేశారు. ఒంగోలు, నెల్లూరు శిక్షణ కేంద్రాలకు వెళ్తున్న ట్రెయినీలు క్రమశిక్షణ, సమయపాలన పాటించాలన్నారు. శిక్షణను విజయవంతంగా పూర్తి చేయాలని ఆకాంక్షించారు. పోలీస్ యూనిఫాం గౌరవాన్ని కాపాడుతూ ప్రజలకు మర్యాదగా, న్యాయబద్ధంగా సేవ చేయాలని హితవు పలికారు.
Similar News
News December 28, 2025
చిత్తూరు: DCCB ఛైర్మన్ పదవీకాలం పొడిగింపు

చిత్తూరు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (DCCB) ఛైర్మన్ అమాస రాజశేఖర్ రెడ్డి పదవీ కాలాన్ని ఆరు నెలల పాటు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన పదవీకాలం ఈనెల 27తో ముగియగా మరో ఆరు నెలల పాటు పొడిగించింది. 2026 జూన్ 26వ తేదీ వరకు రాజశేఖర్ రెడ్డి DCCB నాన్ అఫీషియల్ పర్సన్ ఇన్‌ఛార్జ్‌గా కొనసాగనున్నారు.
News December 28, 2025
పిల్లల్లో డయాబెటీస్ ముప్పు తగ్గించాలంటే

డయాబెటిస్ సమస్య ఒకప్పుడు వృద్ధుల్లో కనిపించేది. ఇప్పుడు ఇది పిల్లలను కూడా ప్రభావితం చేస్తోంది. పిల్లల్లో ఈ సమస్య రాకుండా ఉండాలంటే కొన్నిజాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబంలో ఎవరికైనా డయాబెటిస్ ఉంటే, పిల్లలకు ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించాలి. ఇంట్లో వండిన హెల్తీ ఫుడ్ పెట్టడం, ప్రతిరోజూ వ్యాయామం, స్వీట్లు, డ్రింక్స్ తగ్గించడం, ఫోన్, టీవీ స్క్రీన్ సమయాన్ని పరిమితం చేయడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి.
News December 28, 2025
సూర్య నమస్కారాలతో లాభాలివే..

పరమాత్మ స్వరూపమైన సూర్యుడికి సమర్పించే శక్తివంతమైన సాధనే సూర్య నమస్కారాలు. దీనివల్ల శరీరంలోని 12 చక్రాలు ఉత్తేజితమై, ప్రాణశక్తి ప్రవాహం మెరుగుపడుతుంది. సూర్య కిరణాల ప్రభావంతో మనసులో అశాంతి తొలగి, బుద్ధి ప్రకాశిస్తుంది. రోజూ నిష్టతో సూర్య నమస్కారాలు చేయడం వల్ల ఆరోగ్యం, ఆయుష్షు, ఐశ్వర్యం సిద్ధిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇది ఆత్మవిశ్వాసాన్ని పెంచి, మనల్ని దైవత్వానికి దగ్గర చేస్తుంది.


