News April 21, 2024

పిట్లంలో యాక్సిడెంట్.. వ్యక్తి పరిస్థితి విషమం

image

గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి తీవ్రంగా గాయపడిన ఘటన పిట్లం మండలం చిల్లర్గిలో జరిగింది. గ్రామానికి చెందిన రాకేశ్ బైక్ పై పిట్లం నుంచి వస్తుండగా గ్రామ గేట్ వద్ద గుర్తు తెలియని వాహనం ఢీ కొంది. దీంతో రాకేశ్ తీవ్రంగా గాయపడినట్లు స్థానికులు తెలిపారు. చికిత్స నిమిత్తం బాన్సువాడ ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం NZB తీసుకెళ్లారు.

Similar News

News March 4, 2026

UPDATE: పట్టుబడిన ముఠా సభ్యులు వీరే: CP

image

అంతర్ రాష్ట్ర కాపర్ కాయిల్స్ దొంగల ముఠాను NZB పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ముఠాలో అఫ్జల్ ఖాన్, అర్బాజ్, అన్సార్, షేక్ తాహెర్, సిద్ధిక్ ఖాన్, మమ్మద్ అప్సర్, మహబూబ్ ఖాన్, షేక్ ఆరిఫ్, మహమ్మద్ రాజా, బోర్గే బాలాజీ అను 10 మంది ముఠా సభ్యుల్లో ఏడుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు CP సాయి చైతన్య చెప్పారు. ఆన్సర్, షేక్ తాహెర్, సిద్ధిక్ ఖాన్ అనే ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారన్నారు.

News March 3, 2026

NZB: CM రేవంత్ సమావేశంలో పాల్గొన్న కలెక్టర్

image

డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కలెక్టర్ల సమావేశంలో నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పాల్గొన్నారు. ఈ నెల 6 నుంచి జూన్ 12 వరకు 99 రోజుల పాటు సాగే ‘ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’ అమలుపై ముఖ్యమంత్రి కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. అభివృద్ధి కార్యక్రమాలతో పాటు పాలనను ప్రజలకు చేరువ చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కీలక సూచనలు అందించారు.

News March 3, 2026

భారతీయుల కోసం 24/7 హెల్ప్ లైన్ సేవలు!

image

యూఏఈలో నివసిస్తున్న భారతీయుల కోసం ఇండియన్ పీపుల్స్ ఫోరం (IPF) కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగ, న్యాయ సమస్యలు, అత్యవసర పరిస్థితుల్లో కన్వీనర్లు ఎప్పుడూ అందుబాటులో ఉంటారు. ఎంపీ ధర్మపురి అర్వింద్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పంచుకుంటూ.. ఈ సేవలను ప్రశంసిస్తూ, యూఏఈలోని భారతీయులు వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. త్వరితగతిన సాయం అందించడమే ఈ ఫోరం లక్ష్యమని పేర్కొన్నారు.