News December 21, 2025

ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొత్త పాక్స్ మండలాలు ఇవే

image

PACS పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా ఉమ్మడి వరంగల్ పరిధిలో నూతన PACS ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. HNK జిల్లాలో వేలేరు, ప్రగతి సింగారం, దామెర, నడికుడ, MLG జిల్లాలో ములుగు, తాడ్వాయి, ఏటూరునాగారం, మంగపేట, WGL జిల్లాలో రాయపర్తి, నర్సంపేట, BHPL జిల్లాలో రేగొండ, MHBD జిల్లాలో తొర్రూరు, గూడూరు, నర్సింహులపేట, పోగులపల్లి, JNG జిల్లాలో స్టేషన్‌ఘన్‌పూర్, నర్మేట సిద్ధిపేట జిల్లాలో చేర్యాల, రెబర్తి ఉన్నాయి.

Similar News

News January 7, 2026

MBNR: T20 లీగ్.. పాలమూరు విజయం

image

HCA ఆధ్వర్యంలో నిర్వహించిన ‘T20 కాకా స్మారక క్రికెట్ లీగ్’లో పాలమూరు ఘన విజయం సాధించింది. సిద్దిపేటలో జరిగిన మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన WGL జట్టు 20 ఓవర్లలో 142/7 పరుగులు చేసింది. MBNR జట్టు 19.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. MBNR జట్టు ఆటగాడు అబ్దుల్ రాఫె-79* పరుగులు చేసి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ గా నిలిచాడు. వారిని MDCA ప్రధాన కార్యదర్శి రాజశేఖ్, కోచ్‌లు అభినందించారు.

News January 7, 2026

ఛార్జీలు పెంచితే బస్సులు సీజ్: రవాణా శాఖ

image

AP: సంక్రాంతి రద్దీని ఆసరాగా చేసుకునే ప్రైవేట్ ఆపరేటర్లు ఛార్జీలు పెంచితే బస్సులు సీజ్ చేస్తామని ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ మనీశ్ కుమార్ హెచ్చరించారు. అధికారులు నిత్యం ధరలను మానిటర్ చేస్తున్నారని తెలిపారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నుంచి ఏపీకి తిరిగే బస్సులపై ప్రత్యేక దృష్టిసారించినట్లు పేర్కొన్నారు. ప్రయాణికుల నుంచి కూడా ఫీడ్‌బ్యాక్ తీసుకుంటున్నట్లు చెప్పారు.

News January 7, 2026

అల్లూరి: స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ శతశాతం పూర్తి చేయాలి

image

అల్లూరి, పోలవరం జిల్లాల్లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ శతశాతం పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ దినేశ్ కుమార్ మంగళవారం అధికారులను ఆదేశించారు. రేషన్ సరుకుల పంపిణీలో వచ్చే అవాంతరాలను అధిగమించాలన్నారు. స్మార్ట్ రేషన్ కార్డుల్లో కుటుంబ సభ్యుల పేర్లు నమోదు, తొలగింపు కార్యక్రమాలను సమగ్ర సమాచారంతో చేపట్టాలని సూచించారు. పెండింగ్లో ఉన్న రేషన్ కార్డు లబ్దిదారుల ఈ-కేవైసీ సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు.