News December 21, 2025
అల్లూరి: కిలో చికెన్ రూ.260

అల్లూరి జిల్లాలో పలు ప్రాంతాల్లో బ్రాయిలర్ చికెన్ స్కిన్‌తో కిలో రూ.260కాగా, స్కిన్ లెస్ రూ.280 ఉంది. ఈ ధర రాజవొమ్మంగి, కొయ్యూరు, చింతపల్లి, రంపచోడవరం మండలాల్లో ఉంది. పాడేరు, ముంచింగిపుట్టు తదితర మండలాల్లో రూ.300 వరకు విక్రయిస్తున్నట్టు స్థానికులు తెలిపారు. గత వారం కంటే రూ.20 పెరిగిందన్నారు. రాజమండ్రి, నర్సీపట్నం, అనకాపల్లి నుంచి కోళ్లు జిల్లాకి వస్తాయని వ్యాపారులు చెప్పారు.
Similar News
News January 6, 2026
నిర్మల్ ఉత్సవాల నిర్వహణకు ఏర్పాట్లను ప్రారంభించాలి: కలెక్టర్

నిర్మల్ ఉత్సవాల నిర్వహణకు ఏర్పాట్లను ప్రారంభించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్లోని తన చాంబర్‌లో నిర్మల్ ఉత్సవాల నిర్వహణపై అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈనెల 19వ తేదీ నుంచి 23వ తేదీల్లో నిర్మల్ ఉత్సవాలు జరిపేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు.
News January 6, 2026
డీసీసీబీని అభివృద్ధి పథంలో నడిపించాలి: కలెక్టర్

జిల్లా సహకార పరపతి బ్యాంకు (డీసీసీబీ) కార్యకలాపాలు మరింత సమర్థవంతంగా ఉండాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆమె బ్యాంకును సందర్శించి, వివిధ విభాగాల పనితీరును పరిశీలించారు. రికవరీల శాతం పెంచాలని, డిపాజిట్ల సేకరణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. అనంతరం బ్యాంకు క్యాలెండర్‌ను ఆవిష్కరించిన కలెక్టర్, సిబ్బంది అంకితభావంతో పనిచేసి బ్యాంకును బలోపేతం చేయాలని కోరారు.
News January 6, 2026
వెనిజులా తర్వాత.. ఈ దేశాలే ట్రంప్ టార్గెట్?

వెనిజులాపై <<18751661>>దాడి<<>> చేసి ప్రపంచవ్యాప్తంగా ట్రంప్ అలజడి సృష్టించారు. ఇప్పుడు ఆయన గ్రీన్లాండ్, కొలంబియా, ఇరాన్, మెక్సికో, క్యూబాపై దృష్టి పెట్టే అవకాశం ఉంది. ఇరాన్ అణు కార్యక్రమాలపై ఆయన గుర్రుగా ఉన్నారు. <<18742175>>అటాక్‌కు సిద్ధమని<<>> ఇటీవల హెచ్చరించారు. గ్రీన్లాండ్‌లోని ఐస్‌ల్యాండ్‌పై కన్నేశారు. క్యూబా దశాబ్దాలుగా కొరకరాని కొయ్యగా మిగిలింది. కొలంబియా, మెక్సికో డ్రగ్ ముఠాలపై చర్యలు తీసుకుంటామని ట్రంప్ ప్రకటించారు.


