News April 21, 2024
కోనసీమ: లారీ బోల్తా.. వ్యక్తి మృతి

కోనసీమ జిల్లా ఆలమూరు మండలంలోని చొప్పెల్ల గ్రామంలో ఆదివారం లారీ బోల్తాపి ఓ వ్యక్తి మృతిచెందినట్లు ఎస్సై శ్రీను నాయక్ తెలిపారు. వివరాలు ఇలా.. కొత్తపేటకు చెందిన పెద్దరెడ్డి రాజు చొప్పెల్ల గ్రామంలోని ఓ ఇటుక బట్టీ వద్ద మట్టితో ఉన్న లారీ అన్లోడింగ్ చేయడానికి వాహనాన్ని వెనుక వైపు కదిలించగా ప్రమాదవశాత్తు లారీ బోల్తాపడింది. దీంతో రాజు తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందాడని చెప్పారు.
Similar News
News March 19, 2026
కలెక్టరేట్‌లో ఉగాది సంబరాలు

రాజమహేంద్రవరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గురువారం ఉగాది ఉత్సవాలు వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి MLC సోము వీర్రాజు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అధికారులతో కలిసి పండుగ జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. ప్రజలకు నిస్వార్థంగా సేవలందిస్తున్న సిబ్బందిని ఆయన అభినందించారు. తెలుగు సంస్కృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని పేర్కొన్నారు.
News March 19, 2026
అల్లికల్లో మహిళల ప్రతిభ ప్రశంసనీయం: కలెక్టర్

నిడదవోలు మండలంలోని సెట్టిపేట గ్రామంలో లేస్ వర్క్, ఎంబ్రాయిడరీ యూనిట్‌ను కలెక్టర్ కీర్తి చేకూరి బుధవారం సందర్శించారు. మహిళలు చేతి అల్లికలతో రూపొందించిన వివిధ రకాల దుస్తులను ఆమె ఆసక్తిగా పరిశీలించి, వారి నైపుణ్యాన్ని అభినందించారు. తరతరాలుగా ఈ కళను నమ్ముకుని, ప్రత్యేక గుర్తింపు పొందడం అభినందనీయమని కలెక్టర్ పేర్కొన్నారు.