News December 21, 2025

అడవి మంటలపై అప్రమత్తంగా ఉండాలి: అటవీ శాఖ

image

ఖమ్మం జిల్లాలో అడవి మంటల నివారణకు ప్రజలు పూర్తిస్థాయిలో సహకరించాలని అటవీ శాఖ కోరింది. అటవీ ప్రాంతాల్లో సిగరెట్లు తాగడం, వంటల కోసం నిప్పు రాజేయడం వంటి పనులు చేయరాదని హెచ్చరించింది. “అడవిని రక్షిస్తేనే – భవిష్యత్తు ఉంటుంది” అని పేర్కొంటూ, ఎక్కడైనా అగ్ని ప్రమాదాలు కనిపిస్తే వెంటనే 87422 95323 లేదా టోల్ ఫ్రీ 18001 19334 నంబర్లకు సమాచారం ఇవ్వాలని కోరింది.

Similar News

News January 19, 2026

ఖమ్మం: ‘గ్రామ స్వరాజ్యమే లక్ష్యంగా పనిచేయాలి’

image

సర్పంచ్ పదవిని కేవలం హోదాగా కాకుండా ఒక బాధ్యతగా భావించి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. నూతనంగా ఎన్నికైన సర్పంచులకు నిర్వహించిన శిక్షణ తరగతులకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గ్రామాల్లో పారిశుధ్యం, తాగునీరు, వీధి దీపాలు, పచ్చదనం వంటి మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రభుత్వ పథకాలు ప్రతి గడపకూ చేరేలా సర్పంచులు క్రియాశీలక పాత్ర పోషించాలని స్పష్టం చేశారు.

News January 19, 2026

కంకర మిల్లు అక్రమాలపై కలెక్టరేట్‌లో ఫిర్యాదు

image

ఖమ్మం రూరల్ మండలం పోలేపల్లి గ్రామ పరిధిలో ఉన్న కంకర మిల్లు యాజమాన్యం సాగిస్తున్న అక్రమాలపై సోమవారం జిల్లా కలెక్టరేట్‌ ‘ప్రజావాణి’లో గ్రామస్థులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. మిల్లు నిర్వాహకులు నిబంధనలను తుంగలో తొక్కుతూ పంచాయతీకి రావాల్సిన పన్నులను ఎగ్గొడుతున్నారని వారు ఆరోపించారు. గ్రామ పంచాయతీ నుంచి ఎలాంటి NOC గానీ, పాలకవర్గ తీర్మానం గానీ లేకుండానే మిల్లు పనులు సాగిస్తున్నారని తెలిపారు.

News January 19, 2026

అడవిలో హైటెక్ పద్ధతిలో వన్యప్రాణుల గణన

image

ఖమ్మం జిల్లాలోని 60,300 హెక్టార్ల అటవీ విస్తీర్ణంలో వన్యప్రాణుల గణన ప్రక్రియ ప్రారంభమైంది. డీఎఫ్‌ఓ సిద్ధార్థ్ విక్రమ్ సింగ్ పర్యవేక్షణలో 85 బీట్లలో అధికారులు, వలంటీర్లు 5 రోజుల పాటు కాలినడకన సర్వే చేయనున్నారు. ఈసారి పులులు, చిరుతల ఆనవాళ్లను గుర్తించేందుకు థర్మల్ డ్రోన్లు, ప్రత్యేక మొబైల్ యాప్, జియో ట్యాగింగ్‌ వంటి అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తున్నారు.