News December 21, 2025
RR: యూరియా కావాలా? ఇలా చేయండి

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో యూరియా బస్తాల కోసం రైతులు Fertilizer Booking App డౌన్ లోడ్ చేసుకోవాలని వ్యవసాయశాఖ అధికారులు తెలిపారు. యాప్ ద్వారా యూరియా ఏ షాపులో అందుబాటులో ఉందో చూసి బుక్ చేసుకోవచ్చు. పంట నమోదు సమయంలో ఇచ్చిన మొబైల్ నంబర్ కొడితే OTP వస్తుంది. దాంతో లాగిన్ కావాలి. పంట వివరాలు, విస్తీర్ణం ఎంటర్ చేయాలి. బుక్ చేసిన 24 గంటల్లో ఆ షాపుకే వెళ్లి తెచ్చుకోవాలి.
Similar News
News December 30, 2025
ఇంద్రకీలాద్రిపై నూతన సంస్కరణ

కనకదుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తులకు మెరుగైన సేవలందించే దిశగా ఆలయ పాలకమండలి కీలక నిర్ణయం తీసుకుంది. రూ. 500 అంతరాలయ దర్శన టికెట్ పొందిన భక్తులకు కేటాయించే ఉచిత లడ్డూ ప్రసాదాన్ని ఇకపై నేరుగా టికెట్ స్కానింగ్ పాయింట్ వద్దే పంపిణీ చేయనున్నారు. గతంలో దర్శనం తర్వాత ప్రసాదం కౌంటర్ల వద్దకు వెళ్లాల్సి వచ్చేదని, ఇప్పుడు స్కాన్ పాయింట్ వద్దే ఇవ్వడం వల్ల భక్తుల సమయం ఆదా అవుతుందని అధికారులు తెలిపారు.
News December 30, 2025
సంక్రాంతికి టోల్‌ప్లాజాల వద్ద రద్దీ లేకుండా చర్యలు: కోమటిరెడ్డి

TG: టోల్ ప్లాజాల వద్ద రద్దీ లేకపోతే అసౌకర్యం ఉండదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. సంక్రాంతికి నేషనల్ హైవేలపై రద్దీ నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై ఆయన సమీక్షించారు. ‘CM ఈ అంశంపై సీరియస్‌గా ఉన్నారు. సంక్రాంతికి టోల్ ప్లాజాల వద్ద ఫ్రీ వే ఏర్పాటుకు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి లేఖ రాస్తాను. మేడారం జాతరకు వెళ్లే లక్షలాది భక్తులకు అసౌకర్యం లేకుండా చూడాలని కోరతాను’ అని తెలిపారు.
News December 30, 2025
నెల్లూరు: వారి మధ్య విభేదాలు లేనట్టేనా ?

కావలిలో బీద రవిచంద్ర, కావ్య కృష్ణారెడ్డి మధ్య వైరం ఉందని ప్రచారం జరుగుతోంది. అయితే.. బీదకు TDP అధ్యక్ష పదవి వచ్చిన తర్వాత MLA దూరంగా ఉన్నారని ప్రచారం జరిగింది. ఈ క్రమంలో కావ్య బీద రవిచంద్రను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. దీంతో వారి మధ్య వైర ఉందా.. లేదా..? అనేదానికి చెక్ పెడతారా..?అనేది చూడాల్సి ఉంది.


