News April 21, 2024
నాతో పాటు కోమటిరెడ్డికే సీఎం అర్హత: రేవంత్

TG: తనతోపాటు సీఎం అయ్యే అర్హతలు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఉన్నాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘కోమటిరెడ్డి పోరాట యోధుడు. తెలంగాణ కోసం ఆయన రాజీనామా చేస్తే.. కేసీఆర్ దొంగ దీక్ష చేశారు. ప్రత్యేక రాష్ట్రం కోసం కోమటిరెడ్డి బ్రదర్స్ పోరాటం చేసి కాంగ్రెస్ అధిష్ఠానాన్ని ఒప్పించారు. బీఆర్ఎస్‌కు ఒక్క సీటు వచ్చినా బీజేపీలో కలిపేస్తారు. ప్రధాని మోదీతో కేసీఆర్ ఏనాడూ పోరాడలేదు’ అని ఆయన మండిపడ్డారు.
Similar News
News March 14, 2026
పవన్ ‘అడవి తల్లి బాట’ వెనుక ప్రత్యేక వ్యూహం!

AP: పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని JSP చీఫ్ పవన్ ఇవాళ పాడేరు ఏజెన్సీలో నిర్వహించి ‘అడవితల్లి బాట’ చేపట్టారు. ఆయన కొంతకాలంగా ఏజెన్సీ ప్రాంతాలపై దృష్టిసారించడం వెనుక రాజకీయ వ్యూహం ఉందన్న చర్చ సాగుతోంది. 2019లో 7 ST నియోజకవర్గాలను గెల్చుకొని ఏజెన్సీలో YCP పట్టుబిగించింది. 2024లో కూటమి జోరులోనూ 2సీట్లు గెల్చుకుంది. YCPకి చెక్ పెట్టేలా పవన్ తరచూ గిరిజన ప్రాంతాల్లో పర్యటిస్తున్నారని విశ్లేషిస్తున్నారు.
News March 14, 2026
రాజీనామాకు సిద్ధమైన జీవన్ రెడ్డి!

TG: కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి ఈ నెల 25న పార్టీకి గుడ్‌బై చెప్పేందుకు సిద్ధమవుతున్నారు. BRS నుంచి వచ్చిన జగిత్యాల MLA సంజయ్‌కి పార్టీ ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఆయన పలుమార్లు విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల తర్వాత ఈ వైరం ముదిరింది. దీనిపై జీవన్ రెడ్డి Way2Newsతో మాట్లాడుతూ రాజీనామాకు సిద్ధంగా ఉన్నానన్నారు. తనకు వ్యతిరేకంగా జరుగుతున్న పరిణామాలను అధిష్ఠానానికి వివరించినా లాభం లేదని వాపోయారు.
News March 14, 2026
నెతన్యాహు చనిపోయారా?

ఇరాన్‌తో యుద్ధం వేళ సంచలన ప్రశ్న తెరపైకి వచ్చింది. నెతన్యాహు మృతి చెందారని SMలో ప్రచారం జరుగుతోంది. యుద్ధం గురించి మాట్లాడిన వీడియోను ఆయన నిన్న Xలో షేర్ చేశారు. అందులో నెతన్యాహు కుడిచేతికి 6 వేళ్లున్నాయి. దీంతో ఇది AI వీడియో అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. నెతన్యాహు మరణం గురించి శత్రుదేశానికి తెలియొద్దనే ఇలా AIతో వీడియో చేసి రిలీజ్ చేశారని అంటున్నారు. దీనిపై ఇజ్రాయెల్ స్పందించాల్సి ఉంది.


