News December 21, 2025

రాష్ట్రంలో లక్ష ఉద్యోగాలు.. త్వరలో జాబ్ క్యాలెండర్!

image

AP: త్వరలోనే నిరుద్యోగ యువతకు శుభవార్త రానుంది. కూటమి ప్రభుత్వం జనవరిలో <<18617902>>జాబ్ క్యాలెండర్<<>> విడుదలకు సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే అన్ని శాఖల వారీగా ఖాళీల వివరాలను సేకరిస్తోంది. ప్రాథమిక అంచనాల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా దాదాపు లక్ష పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలుస్తోంది. మున్సిపల్, పట్టణాభివృద్ధి, రెవెన్యూ, విద్యా శాఖలలోనే ఎక్కువ ఖాళీలు ఉన్నాయి. మరో వారంలో ఖాళీల తుది లెక్క తేలనుంది.

Similar News

News February 17, 2026

ఎవరికో ఆ 11 మున్సిపాలిటీలు?

image

TG: నిన్న వాయిదాపడ్డ 11 మున్సిపాలిటీల పాలకవర్గ ఎన్నికలు ఇవాళ జరగనున్నాయి. తొర్రూర్, ఇబ్రహీంపట్నం, కాగజ్‌నగర్, కేతనపల్లి, ఖానాపూర్, జహీరాబాద్, ఇంద్రేశం, డోర్నకల్, జనగామ, ఇల్లందు, సుల్తానాబాద్‌‌లో ఛైర్మన్ పదవులు దక్కించుకునేందుకు కాంగ్రెస్, BRS విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటికే వీటికి ప్రత్యేకంగా అబ్జర్వర్లను నియమించాయి. ఈ 11 మున్సిపాలిటీలు ఎవరి ఖాతాలో పడతాయో సాయంత్రానికి తేలిపోనుంది.

News February 17, 2026

AIIMS రిషికేశ్‌లో ఉద్యోగాలు

image

<>AIIMS<<>> రిషికేశ్‌ 5 డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత గల అభ్యర్థులు మార్చి 15 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి MD, MSఅర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. వయసు 21 నుంచి 40ఏళ్ల మధ్య ఉండాలి. దరఖాస్తు ఫీజు రూ.3000, SC అభ్యర్థులకు రూ.500, PwBDలకు ఫీజు లేదు. ఇంటర్వ్యూ/ రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://aiimsrishikesh.edu.in

News February 17, 2026

గుడ్‌న్యూస్.. వారికీ ఇందిరమ్మ ఇళ్లు!

image

TG: ఉమ్మడి APలో, గత ప్రభుత్వంలో ఇళ్ల నిర్మాణం పూర్తికాని లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. వారికి ఇందిరమ్మ ఇళ్ల కింద సాయం చేయాలని నిర్ణయించింది. గతంలో ఇళ్లు మంజూరై బేస్‌మెంట్ దాకా కట్టగానే ప్రభుత్వాలు మారడంతో నిర్మాణాలు పూర్తి కాలేదు. ఇలాంటి వాళ్లు 9 వేల మంది వరకు ఉన్నారని తేలింది. బేస్‌మెంట్ ఖర్చు రూ.లక్ష మినహాయించి, మిగతా రూ.4 లక్షల దాకా ప్రభుత్వం వారికి అందజేయనుంది.