News April 21, 2024

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల జాబితా విడుదల

image

AP: రాష్ట్రానికి సంబంధించిన 9 మంది ఎంపీ అభ్యర్థులను కాంగ్రెస్ అధిష్ఠానం ఖరారు చేసింది. శ్రీకాకుళం-పెడద పరమేశ్వరరావు, విజయనగరం-బొబ్బిలి శ్రీను, అమలాపురం(SC)- జంగా గౌతమ్, మచిలీపట్నం-గొల్లు కృష్ణ, విజయవాడ-వల్లూరు భార్గవ్, ఒంగోల్-ఈదా సుధాకర్ రెడ్డి, నంద్యాల-జేఎల్ నరసింహ యాదవ్, అనంతపురం-వజ్జల మల్లికార్జున, హిందూపురం-సమద్ షాహీన్‌ల పేర్లతో జాబితా విడుదల చేసింది.

Similar News

News March 29, 2026

ఉదయాన్నే వేడినీళ్లు తాగితే..

image

ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి.
*ఆహారం త్వరగా విచ్ఛిన్నమై జీర్ణక్రియ వేగవంతం అవుతుంది
*క్యాలరీలు త్వరగా కరుగుతాయి. మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది
*శరీరంలోని టాక్సిన్స్ (విష పదార్థాలు) బయటకు వెళ్లిపోతాయి
*ముక్కు దిబ్బడ, గొంతు నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది
*చర్మంపై ముడతలు తగ్గి ఆరోగ్యకరంగా మారుతుంది.

News March 29, 2026

బుద్ధి లేనివాడు ఎలాంటి మాటలు చెబుతాడు?

image

అల్పుడెపుడుబల్కు నాడంబురముగాను
సజ్జనుండు బల్కు చల్లగాను
కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా?
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: తక్కువ విలువ ఉండే కంచుకు వచ్చినంత శబ్ధం విలువైన బంగారానికి రాదు. అలాగే తక్కువ బుద్ధి గలవాడు ఎప్పుడూ గొప్పలు చెబుతూ ఉంటాడు. మంచి ప్రవర్తన గల వ్యక్తి శాంతంగా, సున్నితంగా మాట్లాడతాడు.
<<-se>>#PADHYAM<<>>

News March 29, 2026

‘ఫైర్‌తో ఆడేశాం’.. SRHపై RCB ట్రోల్స్

image

నిన్నటి SRH vs RCB మ్యాచ్‌తో మళ్లీ IPLలో ఫ్రాంచైజీల మధ్య ట్రోల్స్ సందడి మొదలైంది. ‘ప్లే విత్ ఫైర్’ అని మ్యాచ్‌కు ముందు ఎలివేషన్ ఇచ్చిన SRHను ఓడించడంతో RCB ‘ప్లేయిడ్ విత్ ఫైర్’ అని కౌంటర్ ఇచ్చింది. కోహ్లీ ఛేజింగ్‌ను ఆరెంజ్ జెర్సీలో చూస్తే ఇంకా మజా ఉంటుందని మరో పోస్ట్ పెట్టింది. ఇక కోహ్లీ కొట్టిన ఓ సిక్స్‌కు ‘ఏం షాట్ రా మామా’ అని క్యాప్షన్ పెట్టింది.