News December 21, 2025
గుంటూరు: ప్రేమ పేరుతో వంచన..!

ఇన్‌స్టాగ్రామ్ పరిచయం ఇంటర్ అమ్మాయి కొంపముంచింది. గుంటూరుకి చెందిన రాహుల్ అనే యువకుడు విజయవాడకి చెందిన బాలికను ప్రేమ పేరుతో వంచించాడు. ముగ్గురు స్నేహితులతో కలిసి కారులో వచ్చిన నిందితుడు, బాలికను గుంటూరులోని ఓ లాడ్జికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితులను అదుపులోకి తీసుకున్నారు. సామాజిక మాధ్యమాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు.
Similar News
News January 7, 2026
నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో పయనిస్తున్నాయి. సెన్సెక్స్ 143 పాయింట్ల నష్టంతో 84,920 వద్ద.. నిఫ్టీ 56 పాయింట్లు క్షీణించి 26,122 వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్-30 సూచీలో టైటాన్, ఇన్ఫీ, HCL, టెక్ మహీంద్రా, ఎటర్నల్ షేర్లు లాభాల్లో.. TMPV, HDFC, ఎయిర్‌టెల్, మారుతీ షేర్లు నష్టాల్లో పయనిస్తున్నాయి. బ్యాంకింగ్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కనిపిస్తోంది.
News January 7, 2026
కవిత-BRSకు ఎక్కడ చెడింది?

TG: BRSతో కవిత పూర్తిగా <<18785218>>సంబంధాలు<<>> తెంచుకోవడానికి దారితీసిన అంశాలపై చర్చ జరుగుతోంది. కష్టకాలంలో పార్టీ అండగా లేదని కవిత తీవ్రస్థాయిలో విమర్శించారు. అయితే లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ సమయంలో KTR, హరీశ్ అధికారులను అడ్డుకోవడం, బెయిల్ కోసం కృషి చేయడం గుర్తులేవా అని BRS శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి. ఇక KTR-కవిత మధ్య ఆస్తుల గొడవ కారణంగానే ఆమె బయటికి వచ్చారని ప్రత్యర్థి పార్టీలు అంటున్నాయి. మీరేమంటారు?
News January 7, 2026
NZB: ఎమ్మెల్సీ పదవికి అప్పుడే పోటీ.. బరిలో ఉన్నది వీరేనా?

కవిత రాజీనామాతో అప్పుడే నిజామాబాద్ MLC పదవికి పోటీ పెరిగింది. ఆశావహులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కాంగ్రెస్‌లో మాజీ MLCలు అరికెల నర్సారెడ్డి, ఆకుల లలిత, బాడ్సి శేఖర్ గౌడ్ పేర్లు వినిపిస్తున్నాయి. BRS, బీజేపీ కూడా బలమైన అభ్యర్థులను బరిలో దించే వ్యూహాలు చేస్తున్నా స్థానిక బలాలతో అంచనాలు తారుమారవుతాయి. స్థానిక ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ ఎక్కువ స్థానాలు గెలిచి MLCని కైవసం చేసుకునే ప్లాన్ చేస్తోంది.


