News December 21, 2025

YS జగన్‌కు బర్త్ డే విషెస్ చెప్పిన షర్మిల.!

image

ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు YS షర్మిల తన అన్న YCP అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సోషల్ మీడియా వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘భగవంతుడు మీకు ఆయురారోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’ అని ఆకాంక్షించారు. అన్నపై తనకున్న ప్రేమను చాటుకున్న ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.

Similar News

News January 9, 2026

కడప: సీట్‌లో కూర్చోకముందే ఆ SIలకు మళ్లీ ట్రాన్స్‌ఫర్

image

మూడు రోజులక్రితం కడప జిల్లాలో 18 మంది SIలు ట్రాన్స్‌ఫర్ అయిన విషయం తెలిసిందే. వారు బదిలీ అయిన స్టేషన్‌లో రిపోర్ట్ చేయకమునుపే వారిలో కొందరిని మళ్లీ బదిలీ చేశారు. మొదట ప్రొద్దుటూరు రూరల్ స్టేషన్ SIగా అరుణ్‌రెడ్డిని మైదుకూరుకు ట్రాన్స్‌ఫర్ చేశారు. ఆయన అక్కడ సీట్‌లో కూర్చోకమునుపే కడప వీఆర్‌కి బదిలీ అయ్యారు. బద్వేల్ నుంచి శ్రీకాంత్‌ను మొదట ప్రొద్దుటూరు 1-టౌన్, ఇప్పుడు రూరల్‌కు బదిలీ చేశారు.

News January 9, 2026

గండికోట ఉత్సవాలు.. నేడు కడపలో బైక్ ర్యాలీ

image

గండికోట ఉత్సవాలు ఘనంగా నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగా కడపలో శుక్రవారం భారీ బైక్ ర్యాలీ నిర్వహిస్తామని కలెక్టర్ శ్రీధర్ వెల్లడించారు. రాజీవ్ మార్క్ సర్కిల్ వద్ద మధ్యాహ్నం 3.30 గంటలకు ర్యాలీ ప్రారంభమై కలెక్టర్ ఆఫీస్, ఎర్రముక్కపల్లి సర్కిల్, ఐటీఐ బిల్ట్ సర్కిల్, వినాయక నగర్ సర్కిల్, అల్మాస్పేట్ మాసాపేట సర్కిల్, అన్నమయ్య సర్కిల్, అప్సర హాల్ మీదుగా ఆర్టీసీ బస్టాండ్ వరకు జరుగుతుంది.

News January 8, 2026

ఒంటిమిట్ట: అమ్మమ్మను కత్తితో పొడిచాడు..!

image

ఒంటిమిట్ట మండలం నరసన్నగారిపల్లిలో కత్తిపోట్లు కలకలం రేపాయి. స్థానికుల వివరాల మేరకు.. గ్రామానికి చెందిన రాఘవమ్మ(70) పొలంలో పనిచేస్తుండగా ఆమె మనవడు నంద(20) కత్తితో పొడిచాడు. వెంటనే స్థానికులు గమనించి ఆమెను 108లో కడప రిమ్స్‌కు తరలించారు. మద్యానికి డబ్బులు ఇవ్వకపోతేనే దాడి చేసినట్లు సమాచారం. నంద తల్లి కువైట్‌లో ఉండగా.. ప్రస్తుతం అతను అమ్మమ్మ రాఘవమ్మ దగ్గర ఉంటున్నాడు.