News April 21, 2024
విశాఖ: కరెంట్ షాక్‌తో వ్యక్తి మృతి

అచ్చుతాపురం మండలంలో కరెంట్ షాక్‌కు గురై ఒక వ్యక్తి మృతి చెందాడు. రామన్నపాలెంకి చెందిన ధర్మిరెడ్డి శ్రీను (42) తన ఇంటి ముందు ఏర్పాటు చేసిన రేకుల షెడ్‌లో విద్యుత్ వైర్లు తగిలించే క్రమంలో కరెంట్ షాక్ కొట్టి కింద పడిపోయాడు. వెంటనే ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐ బుచ్చిరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Similar News
News April 21, 2025
విశాఖలో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం

ద్వారకానగర్‌లో ఎస్టీ, ఎస్సి విద్యార్థుల ఉచిత డీఎస్సీ కోచింగ్ సెంటర్‌లో సీఎం చంద్రబాబు చిత్రపటానికి డీఎస్సీ అభ్యర్థులు పాలాభిషేకం చేశారు. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవరావు, తదితరులు పాల్గొన్నారు.
News April 20, 2025
గాజువాకలో బెట్టింగ్ ముఠా అరెస్ట్

విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చీ పర్యవేక్షణలో బెట్టింగ్ ముఠాను ఆదివారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. గాజువాక పరిధిలో బీహెచ్‌పీవీ వద్ద బెట్టింగ్ ఆడుతున్నట్లు సమాచారం రావడంతో నలుగురిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 23 సెల్ ఫోన్లు, మూడు ల్యాప్‌టాప్స్ స్వాధీనం చేసుకున్నారు. ఎప్పటి నుంచి ఈ వ్యవహారం సాగుతుందో ఆరా తీస్తున్నారు. కమిషనర్ ఏర్పాటు చేసిన స్పెషల్ టీం ఈ దాడులు చేసింది.
News April 20, 2025
విశాఖ: ఒంటరితనం భరించలేక సూసైడ్

ఒంటరితనం భరించలేక ఉరివేసుకుని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన విశాఖలో ఆదివారం చోటు చేసుకుంది. పీఎం పాలెం సెకండ్ బస్టాప్ సమీపంలోని ఓ అపార్ట్మెంట్‌లో మృతుడు నివస్తున్నాడు. తల్లిదండ్రులు, అన్నయ్య మృతి చెందడంతో ఒంటరిగా ఉన్న ఆయన మానసికంగా బాధపడుతూ ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం తెలుసుకున్న పీఎంపాలెం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం KGHకి తరలించారు.