News December 21, 2025

హనుమకొండ: నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ

image

టాస్క్ రీజనల్ సెంటర్‌లో నిరుద్యోగ యువతకు పోటీ పరీక్షల కోసం ఉచిత శిక్షణ అందించనున్నట్లు నిర్వహకులు తెలిపారు. అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ స్టడీస్, జనరల్ ఇంగ్లీష్, స్టాటిక్ జీకే, కరెంట్ అఫైర్స్ అంశాలపై శిక్షణ ఉంటుందన్నారు. కంప్యూటర్ కోర్సుల్లో శిక్షణ అందించనున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 27 లోపు హనుమకొండ చైతన్య యూనివర్సిటీలోని టాస్క్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.

Similar News

News January 22, 2026

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రేపటి నుంచి షబ్బీర్ అలీ పర్యటన

image

తెలంగాణ ప్రభుత్వ సలహాదారు షబ్బీర్అలీ మూడు రోజుల పాటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. రేపు నిజామాబాద్‌లో పాలిటెక్నిక్ ఐటీఐ సందర్శనతోపాటు, నిజామాబాద్ రూరల్, మాక్లూర్ పోలీస్ స్టేషన్ల నూతన భవనాలను ప్రారంభిస్తారు. రాత్రి కామారెడ్డిలో బస చేస్తారు, ఎల్లుండి కామారెడ్డి పట్టణంలోని ఇస్లాంపుర, గ్రీన్ సిటీ, లిటిల్ స్కాలర్ స్కూల్ సమీపంలోని OHSR వాటర్ ట్యాంకులను సందర్శిస్తారు.

News January 22, 2026

నల్గొండ : పీజీ సెమిస్టర్-1 పరీక్షల షెడ్యూల్ విడుదల

image

ఉమ్మడి నల్గొండ జిల్లా మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం పరిధిలో PG ( M.A / M.Sc / M.Com / M.S.W ) సెమిస్టర్-1 రెగ్యులర్ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ ని యూనివర్సిటీ అధికారులు ప్రకటించారు. ఫిబ్రవరి 10 నుంచి ఫిబ్రవరి 20 మధ్య పరీక్షలు జరుగుతాయని కంట్రోలర్ అఫ్ ఎగ్జామినేషన్ డాక్టర్. ఉపేందర్ రెడ్డి తెలిపారు. పరీక్ష సెంటర్ లోకి మొబైల్ ఫోన్, ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదన్నారు.

News January 22, 2026

కోదాడ: బైక్ అదుపుతప్పి యువకుడు మృతి..

image

బైక్ అదుపు తప్పి యువకుడు మృతి చెందిన ఘటన కోదాడలో చోటు చేసుకుంది. బుధవారం గౌతమ్ (17) తన స్నేహితుడు సంతోష్‌తో కలిసి బైక్‌పై మద్రాస్ సెంటర్‌కు వెళ్లి వస్తుండగా బైక్ అదుపుతప్పి డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో గౌతమ్‌కు తీవ్ర గాయాలు కాగా, సంతోష్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గౌతమ్ గురువారం తెల్లవారుజామున ప్రాణాలు విడిచాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.