News December 21, 2025
NZB: GP ఎన్నికల్లో నకిలీ నోట్లు?

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నకిలీ నోట్ల కలకలం రేపుతోంది. వర్ని కెనరా బ్యాంకులో ఓ వ్యక్తి రూ.2.08 లక్షల నకిలీ నోట్లు తీసువచ్చిన విషయం తెలిసిందే. బ్యాంకు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కామారెడ్డిలో ఓ వైన్స్ షాపులో నకిలీ రూ.500 నోట్లు మార్చే ముఠాలోని ఇద్దరు నిందితులపై PD యాక్ట్ నమోదు చేశారు. GP ఎన్నిల్లో దొంగనోట్లు పంపిణీ చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హాట్ టాపిక్‌గా మారింది.
Similar News
News December 27, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News December 27, 2025
పిల్లల్లో ఉన్న నైపుణ్యాన్ని గుర్తించి ప్రోత్సహించాలి: పార్వతీపురం కలెక్టర్

విద్యార్థులను కేవలం ఉత్తీర్ణులుగా చేయడం మాత్రమే కాకుండా, వారిని సమాజానికి పనికొచ్చే ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడమే ఉపాధ్యాయుల ప్రధాన లక్ష్యం కావాలని జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి హితవుపలికారు. శుక్రవారం కలెక్టరేట్‌లో మోడల్ స్కూల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్ కళాశాలల ప్రిన్సిపల్స్, ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. విద్యాబోధనలో ఉపాధ్యాయులు అనుసరించాల్సిన కీలక మార్పులపై పలు సూచనలు చేశారు.
News December 27, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (డిసెంబర్ 27, శనివారం)

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.27 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.44 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.17 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4.14 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 5.50 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.08 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.


