News December 21, 2025
రేపు వరదలు, ప్రమాదాలపై మాక్ డ్రిల్

వరదలు, పరిశ్రమల ప్రమాదాలు జరిగినప్పుడు ఎదుర్కోవాల్సిన తీరుపై అవగాహన కల్పించేందుకు సోమవారం ఖమ్మం నయాబజార్లోని ZPSS, జనరల్ ఆస్పత్రిలో మాక్ డ్రిల్ నిర్వహించనున్నట్లు ఖమ్మం కలెక్టర్ అనుదీప్ తెలిపారు. మాక్ డ్రిల్ జరగనున్నందున ప్రజలు హాజరయ్యేలా ఏర్పాట్లు చేశామని వెల్లడించారు. ఇందులో 50 మంది చొప్పున ఆపద మిత్ర వలంటీర్లు, 20 మంది NCC కేడెట్లు పాల్గొంటారని తెలిపారు.
Similar News
News January 12, 2026
ఖమ్మం జిల్లాలో యూరియా కొరత లేదు: DAO

ఖమ్మం జిల్లాలో ప్రస్తుతం 9,844 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని, ఎటువంటి కొరత లేదని జిల్లా వ్యవసాయ అధికారి డి.పుల్లయ్య తెలిపారు. రైతులకు సకాలంలో యూరియా సరఫరా చేసేందుకు అన్ని మండలాల్లో చర్యలు చేపట్టినట్లు చెప్పారు. మార్క్‌ఫెడ్ ద్వారా ప్యాక్స్, ప్రైవేట్ డీలర్లకు యూరియా సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు జిల్లాలో 32,793 మెట్రిక్ టన్నుల యూరియా రైతులకు పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు.
News January 12, 2026
భర్త ఇంటి ముందు భార్య ఆందోళన

తాను ఉండగా మరో మహిళతో కాపురం పెట్టిన భర్త ఇంటి ముందు భార్య నిరసనకు దిగింది. బాధితురాలి వివరాలు.. ఖమ్మం (D)కు చెందిన సాయిచరణ్‌కు 15ఏళ్ల క్రితం శిల్పతో వివాహమైంది. ఇద్దరు పిల్లలున్నారు. ఐదేళ్లుగా భార్యను వదిలేసిన అతను కీసర అహ్మద్ గూడలో ఉంటున్నట్లు తెలుసుకున్న శిల్ప అక్కడికి చేరుకుంది. ఇంట్లోకి రానివ్వకపోవడంతో బయటే కూర్చుంది. పోలీసులను ఆశ్రయించిన పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేసింది.
News January 12, 2026
వరంగల్ MGMలో ఖమ్మం జిల్లా వ్యక్తి మృతి

ఖమ్మం జిల్లాకు చెందిన రవికుమార్(34) వరంగల్ రైల్వే స్టేషన్ వద్ద శ్వాస ఇబ్బందితో కుప్పకూలారు. ఈనెల 9న జరిగిన ఈ ఘటనలో హోంగార్డ్ అమీన్ బాధితుడిని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రవికుమార్ ఆదివారం రాత్రి మృతి చెందారని పోలీసులు తెలిపారు. మృతుని బంధువుల వివరాల కోసం పోలీసులు గాలిస్తున్నారు. సమాచారం తెలిసిన వారు తమను సంప్రదించాలని ఎస్సై తేజ కోరారు.


