News December 21, 2025
రూ.800 కోట్లతో తిరుపతి బస్టాండ్ నిర్మాణం..?

తిరుపతి బస్టాండ్‌ను అంతర్జాతీయ ప్రమాణాలతో పునర్నిర్మించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. RTC, ప్రభుత్వం, ప్రైవేట్ భాగస్వామ్యంతో(PPP) ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనుంది. NHML, RTC సంయుక్తంగా ప్రతిపాదించిన మోడల్‌ను CMకు పంపగా కొన్ని మార్పులతో ఆమోదం తెలిపినట్లు సమాచారం. ఈ ప్రాజెక్టుకు రూ.600 నుంచి రూ.800 కోట్లు ఖర్చు చేయనున్నారు. తిరుపతిలో సోమవారం జరిగే సమావేశంలో ప్రాజెక్ట్ వివరాలు వెల్లడించనున్నారు.
Similar News
News January 13, 2026
డిఫెన్స్ పటిష్ఠతపై కేంద్రం దృష్టి

ప్రపంచంలో రాజకీయ అనిశ్చితి, యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో దేశ రక్షణ బడ్జెట్ పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. US సహా పలు దేశాలు ఇప్పటికే డిఫెన్స్‌కు అధిక నిధులు కేటాయిస్తున్నాయి. ఇటు చైనా తన సైనిక శక్తిని విస్తరిస్తోంది. ఈ తరుణంలో మన ’రక్షణ’పై కేంద్రం దృష్టి సారించింది. గత బడ్జెట్లో ₹6.8L CR డిఫెన్స్‌కు కేటాయించింది. ఈసారి అది మరింత పెరగొచ్చని జియోజిత్ ఇన్వెస్టుమెంట్స్ చీఫ్ విజయకుమార్ పేర్కొన్నారు.
News January 13, 2026
శ్రీకాకుళం: మాజీ మంత్రి సూర్యనారాయణ అంత్యక్రియలు పూర్తి

మాజీ మంత్రి గుండ అప్పల సూర్యనారాయణ అంత్యక్రియలు శ్రీకాకుళంలో మంగళవారం పూర్తి చేశారు. అధిక సంఖ్యలో పాల్గొన్న కార్యకర్తలు, అభిమానులు మధ్య ఆయన అంత్యక్రియలు జరిగాయి. ప్రజా సేవ లక్ష్యంగా పని చేసిన ఘనత ఆయనకే దక్కుతుందని ఎమ్మెల్యే రమణమూర్తి పేర్కొన్నారు. ఎన్నో ఎదురు దెబ్బలకు ఎదుర్కొన్న ఆయన టీడీపీలో ఊపిరి పోయేవరకు కొనసాగారని వివరించారు. ఆయన మృతితో పార్టీకి తీవ్ర నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.
News January 13, 2026
EC షెడ్‌లో కోడి పిల్లలను వదిలేముందు పేపర్ వేస్తున్నారా?

EC(ఎన్విరాన్‌మెంట్ కంట్రోల్డ్) షెడ్‌లో పొట్టు మీద కోడి పిల్లలను నేరుగా వదలడం మంచిది కాదు. షెడ్‌లో పొట్టు కాస్త పదునుగా ఉండటం వల్ల కోడి పిల్లల కాళ్ల మధ్య గుచ్చుకొని గాయాలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఆ పొట్టుపై కచ్చితంగా పేపర్ వేశాకే చిన్న కోడి పిల్లలను వదలాలి. 1000 పిల్లలకు 5 కేజీల పేపరును పైన వీడియోలో చెప్పిన విధంగా వేయాలి. పేపరు వల్ల కోడి పిల్లలు ఆహారాన్ని సులభంగా గుర్తించి తినగలుగుతాయి.


