News December 21, 2025

HYD: బాబోయ్.. ఇదేం చలిరా బాబూ

image

నగరం చలికి వణికిపోతోంది. పిల్లలు, వృద్ధులు ఇబ్బంది పడుతున్నారు. స్వెటర్ లేనిదే బయటకు వెళ్లడం కష్టమైపోతోంది.
నగరగంలో పలుచోట్ల ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కు పడిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో చలి మరీ దారుణంగా ఉంటోంది. ఈ పరిస్థితి మరో 3 రోజులు ఉండవచ్చని వాతావరణశాఖ హెచ్చరిక. శేరిలింగంపల్లిలో 6.3, రాజేంద్రనగర్‌లో 7.4, మల్కాజిగిరిలో 7.5, చందానగర్‌లో 8.4, అల్వాల్‌లో 9.4°Cనమోదై చుక్కలు చూపుతోంది.

Similar News

News January 2, 2026

మూసీ పరివాహకంలో నైట్ ఎకానమీ అభివృద్ధి: సీఎం

image

మూసీ పరివాహక ప్రాంతంలో నైట్ ఎకానమీని అభివృద్ధి చేసేందుకు మూసీ ప్రక్షాళనకు సిద్ధమైనట్లు CM అసెంబ్లీలో తెలిపారు. దీంట్లో నష్టపోయే స్థానికులకు బ్రహ్మాండమైన కాలనీ కట్టిస్తామన్నారు. అంతర్జాతీయ కన్సల్టెన్సీని పెట్టుకున్నామని, DPR వచ్చేవరకు ప్రజెక్టు అంచనా చెప్పమని హరీశ్‌రావు అడిగిన ప్రశ్నకు సీఎం బదులిచ్చారు. ప్రజెక్టు వద్దన్నోళ్లు అంబర్‌పేట్ శ్మాశానవాటిక వద్ద ఒకరాత్రి ఉండి దుర్భరస్థితిని చూడాలన్నారు.

News January 2, 2026

HYD: సమ్మర్‌లో కరెంట్ కష్టాలకు చెక్!

image

వేసవి కాలంలో ఉక్కపోతతో నగరంలో అధికంగా ఏసీలు, ఫ్యాన్లు వినియోగిస్తారు. దీంతో విద్యుత్ వినియోగం భారీగా పెరుగుతోంది. ఈ క్రమంలో విద్యుత్ కోతలూ ఉంటాయి. ఈ సారి కోతలకు చెక్ పెట్టాలని విద్యుత్‌శాఖ చూస్తోంది. మహానగర వ్యాప్తంగా 20 సబ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. వేసవి కాలానికి ముందే వీటిని ప్రారంభించాలని ఉన్నతాధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

News January 2, 2026

HYD: AI కోర్సులకు ఫ్రీగా ఆన్‌లైన్ శిక్షణ

image

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), ML, డేటా సైన్స్ తదితర సాఫ్ట్‌వేర్ కోర్సులకు ఆన్‌లైన్ ద్వారా శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు నేషనల్ స్కిల్ అకాడమీ డైరెక్టర్ వెంకటరెడ్డి తెలిపారు. శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు పరీక్షలు నిర్వహించి కేంద్ర ప్రభుత్వ ఆమోదిత సర్టిఫికెట్‌ ప్రదానం చేస్తామని తెలిపారు. అసక్తిగల అభ్యర్థులు జనవరి 15లోగా nationalskillacademy.inలో దరఖాస్తు చేసుకోవాలని కోరారు.